బ్యాడ్ బాయ్ ఫ్రెండ్, ఎయిర్ పోర్టులో రచ్చరచ్చ చేసిన గర్ల్ ఫ్రెండ్, బాంబులు
ప్రియుడు తనను వదిలేస్తున్నాడని, తన ఊరు విడిచి వెళ్లకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రియురాలు ఎన్నో ప్లాన్లు వేస్తుందని విన్నాం, మనం ఇప్పటికే చూశాము. కానీ సిలికాన్ సిటీలో ఓ ప్రియురాలు తన బాయ్‌ఫ్రెండ్ సిటీ వదిలి వెళ్లకుండా ఆపాలని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ చేసింది. ప్రియురాలి దెబ్బకు ప్రియుడితో పాటు పోలీసు అధికారులు బిత్తరపోయారు.
పుణేకు చెందిన 29 ఏళ్ల యువతి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ) హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి నకిలీ బాంబు బెదిరింపులు చేసింది. ఆ వ్యక్తి (ప్రియుడు) బ్యాగులో బాంబు ఉందని ఆమె ఆరోపించింది. తన ప్రియుడిని ముంబాయి విమానం ఎక్కకుండా అడ్డుకోవడమే ఆమె ఉద్దేశం. కానీ ఊహించని విధంగా ఆ ప్రియురాలికి ఎదురుదెబ్బ తగిలింది. నకిలి బాంబు బెదిరింపు కాల్ చేసిన యువతి ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం నిందితురాలిని ఇంద్ర రాజ్‌వర్‌గా గుర్తించారు. బెంగళూరు నుంచి ముంబాయి వెళ్లాలనుకున్న బాయఫ్రెండ్ మీర్ రజా మెహదీని అడ్డుకునేందుకు ఇంద్ర రాజ్ వర్ ప్రయత్నించింది. మీర్ రజా లగేజీలో బాంబు ఉన్నట్టు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించింది.
విషయం తెలుసుకున్న తర్వాత అధికారులు ఎయిర్ పోర్టులో మీర్ రజా మెహదీని, అతను తీసుకెలుతున్న లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ అతని బ్యాగుల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు ఏవీ కనుగొనలేకపోయారు. ఫోన్ కాల్ ఫేక్ అని పోలీసులు బావించారు. తదుపరి విచారణ తర్వాత ఇంద్ర రాజ్ వర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ కాల్ వచ్చిన సమయానికి ముందు మీర్ రజా మెహదీ, అతని ప్రియురాలు ఇంద్ర రాజ్ వర్ ఇద్దరూ ఆ సాయంత్రం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నారని అధికారులు గుర్తించారు.
ముంబాయికి వెళ్లడానికి మీర్ రజా విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నప్పటికీ అతన్ని ముంబాయి పంపించడానికి అతని ప్రియురాలు ఇంద్ర రాజ్ వర్ అంగీకరించలేదని తెలిసింది. నకిలీ బాంబు ఫోన్ కాల్ చేయడానికి ముందు వారు ఎయిర్ పోర్టు లాంజ్‌లో చర్చలు జరిపారని, ఆ సమయంలో ఇద్దరి మధ్య తేడాలు రావడంతో ప్రియురాలు ఇంద్ర రాజ్ వర్ ఆమె ప్రియుడు మీర్ రజాపై ఆగ్రహం వ్యక్తం చేసిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఆ తరువాత ప్రియుడు మీర్ రజా ముంబాయి వెళ్లడానికి సిద్దం అయ్యాడు. ప్రియుడు మీర్ రజాను ఎలాగైనా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇంద్ర రాజ్ వర్ ఎయిర్ పోర్టు అధికారులకు ఫోన్ చేసి నకిలి బాంబు బెదిరింపులు చేసిందని అధికారులు తెలిపారు. నకిలి బాంబు బెదిరింపు కాల్ చేయడంతో ఇంద్ర రాజ్‌వర్‌ను అరెస్ట్ చేసిన కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తన స్నేహితుడు మీర్ రజా మెహదీతో తనకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని, అతను ముంబాయి వెళ్లకుండా అడ్డుకునేందుకే ఇలాంటి చర్యకు పాల్పడ్డానని ఇంద్ర రాజ్ వర్ అంగీకరించిందని, విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రియుడి మీద ప్రేమ ఎక్కువ అయ్యి ఇంద్ర రాజ్ వర్ ఇలా చేసి ఉంటుందని కొందరు అంటుటే, మరి కొందరు మాత్రం ఆమెకు కోవ్వు కోలాటం వేస్తోందని, అందుకే ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications