ఆకలి రాజ్యం - గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 101వ స్థానం : పాక్ - బంగ్లాదేశ్ కంటే దిగువన భారత్..!!
ఆకలి సూచీలో భారత్ స్థానం దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న భారత్ ఒకటిగా నిలిచింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021 జాబితాలో మొత్తం 116 దేశాలకు గానూ భారత్ 101వ స్థానంలో నిలిచింది. న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా వంటి దేశాల సరసన భారత్ చేరింది. మన దేశం తరువాతి స్థానాల్లో పాపువా న్యూ గినియా (102), ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా (103), కాంగో (105), మోజాంబిక్, సియార్రా లియోన్ (106), తిమోర్ లెస్తే (108), హైతీ (109), లిబియా (110) వంటి దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో అట్టడుగున సోమాలియా ఉంది.
అయితే, భారత్ కంటే పాకిస్తాన్ (92), నేపాల్, బంగ్లాదేశ్ (76)లకు ఉత్తమ ర్యాంక్‌లు దక్కించుకున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏఢాది భారత్ మరింత దిగజారి పోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది మొత్తం 107 దేశాలకుగాను భారత్‌కు 94వ ర్యాంక్ లభించింది. జాతీయ, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో 2030 నాటికి ఆకలి బాధలు లేని సమాజం (జీరో హంగర్) దిశగా పురోగతిని కొలవడానికి కీలక అంశాలను గుర్తించడానికి ఈ జాబితా తయారు చేస్తారు. ప్రస్తుత సూచీలను బట్టి 2030 నాటికి ఈ జాబితాలోని 47 దేశాలు ఆకలి లేని సమాజాన్ని సాధించడంలో వెనుకబడతాయని అంచనా వేశారు.

పోషకాహార లోపం, చిన్నారుల్లో వయసుకు తగిన బరువు లేకపోడం, చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేకపోవడం, చిన్నారుల మరణాలు.. అనే నాలుగు సూచికల ఆధారంగా ఈ జాబితా రూపొందిస్తారు. 100 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వచ్చాయనే అంశంతో ర్యాంక్ కేటాయిస్తారు. 0 స్కోరు వస్తే ఆకలి లేదని అర్థం. 100 పాయింట్లు వస్తే ఆకలి సమస్య తీవ్రంగా ఉందనిఅర్థం. తీవ్రత ఆధారంగా ప్రతి దేశాన్ని తక్కువ నుంచి అత్యంత ఆందోళనకరం మధ్య వర్గీకరిస్తారు. ఈ ఏడాది జాబితా ప్రకారం సోమాలియా అత్యంత ఆందోళనకరం విభాగంలో ఉంది.
2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. సమస్య పెరుగుదలలో వేగం కనిపిస్తోందని తెలిపింది. 2006 నుంచి 2012 మధ్య కాలంలో ప్రపంచ పాయింట్లు 20.4 నుంచి 25.1 వరకు పడిపోయినట్లు నివేదిక చెప్పింది. 2012 నుంచి 2.5 పాయింట్లు తగ్గినట్లు తెలిపింది. ప్రధానంగా జాబితా రూపొందించడానికి నాలుగు సూచికల్లో ఒకటైన పోషకాహారలోపం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతోందని నివేదిక వెల్లడించింది.












Click it and Unblock the Notifications