డిఫెన్స్‌లో ‘అమిత్ షా’: కొంప ముంచిన ‘పుత్ర’ వాత్సల్యం

మరో రెండు నెలల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న వేళ.. అధికార బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్ షా కంపెనీలు గత మూడేళ్లలోనే అనూహ్య లాభాలు గడించడం.. స్టాక్ ట్రేడింగ్ కంపెనీగా విద్యుత్ ఉత్పాదక

న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్‌షా వ్యాపార లావాదేవీలు కేంద్రంలోనూ, గుజరాత్ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని ఇరకాటంలోకి నెట్టేశాయి. అవినీతి రహిత పాలన అందిస్తామని, నల్లధనాన్ని వెలికితీస్తామని పదేపదే ప్రకటించుకుంటారు కమలనాథులు.

ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 'ఎయిమ్స్' కళాశాల ప్రారంభిస్తూ 'కాంగ్రెస్ పార్టీ' బెయిల్‌పై నడుస్తున్నదంటూ (నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ పై కేసు, అక్రమాస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ పై సీబీఐ కేసు నేపథ్యంలో) ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ మరో రెండు నెలల్లో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న వేళ.. జయ్ షా వ్యాపార లావాదేవీల్లో అవకతవకలపై 'ది వైర్' అనే వెబ్‌సైట్ ప్రచురించిన వార్త వారిని డిఫెన్స్‌లో పడేసింది.

2014కి ముందు నష్టాల్లో ఉన్న జయ్ షా సారథ్యంలోని 'టెంపుల్ ఎంటర్ ప్రైజేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టర్నోవర్.. కేంద్రంలో బీజేపీ నేత నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 16 వేల రెట్లు పెరిగిందని 'ది వైర్' న్యూస్ పోర్టల్ వార్తా కథనం ప్రచురించింది. జయ్ షా తన తండ్రి అమిత్ షా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల రుణాన్ని అక్రమ మార్గాల్లో పొందారని వచ్చిన వార్త రాజకీయ వర్గాల్లో కలకలం స్రుష్టించింది.

సత్యదూరమన్న బీజేపీ.. రూ.. 100 కోట్లకు జయ్ షా పరువు నష్టం దావా

సత్యదూరమన్న బీజేపీ.. రూ.. 100 కోట్లకు జయ్ షా పరువు నష్టం దావా

సదరు జయ్ షా సంస్థ ‘టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్'.. ‘రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్' కు సమర్పించిన బ్యాలెన్స్ షీట్ వివరాలు కూడా వార్తాకథనంలో ప్రస్తావించింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక అమిత్ షా కుమారుడికి చెందిన సంస్థల ఆస్తులు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంపై దర్యాప్తు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ వార్త సత్యదూరమని బీజేపీ వాదిస్తున్నది. ఈ వార్త ప్రచురితమైన వెంటనే స్పందించిన అమిత్ షా తనయుడు జయ్ షా.. తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకు అసత్యాలను వండి వార్చారని సదరు వెబ్‌సైట్‌ ఎడిటర్, విలేకరిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. గమ్మత్తేమిటంటే ఈ వార్త సేకరించిన వార్తా ప్రతినిధి.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్‌తో గల అనుబంధం, ఇతర ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలను బయట పెట్టారు.

 వార్త అంతా తప్పుల తడక అన్న జయ్ షా

వార్త అంతా తప్పుల తడక అన్న జయ్ షా

తన కంపెనీపై అవాస్తవాలతో కూడిన కథనం ప్రచురించి తన పరువుకు భంగం కలిగించారంటూ ‘ది వైర్' వెబ్ సైట్‌పై ‘టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్' యజమాని, అమిత్ షా తనయుడు జయ్ షా రూ.100 కోట్లకు దావా వేశారు. తన వ్యాపారాలన్నీ చట్టబద్ధమేనని స్పష్టం చేశారు. తమ సంస్థ బ్యాంకు లావాదేవీలు, పన్ను రిటర్న్స్ పత్రాలు, ఇతర రికార్డులు పరిశీలిస్తే ఇదే సంగతి తేటతెల్లమవుతుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తన తండ్రి అమిత్ భాయ్ షా హోదా కారణంగానే తన కంపెనీకి లాభాలు వచ్చాయన్న అపోహలు నెలకొల్పేందుకే ఈ వార్తా కథనం ప్రచురించినట్లు ఉన్నదని జయ్ షా తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

 జయ్ షాపై ఆరోపణలకు ఇలా ఖండన

జయ్ షాపై ఆరోపణలకు ఇలా ఖండన

జయ్ షా సంస్థలో ఎటువంటి అక్రమాలు జరుగలేదని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దశాబ్ద కాలంగా జయ్ షాకు రాజేశ్ ఖండ్వాలా స్టాక్ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఖండ్వాలాకు చెందిన జయ్ షా సంస్థ తీసుకున్న రుణం విషయం రహస్యమేమీ కాదని పేర్కొన్నారు. ఆ విషయాన్ని టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ తన నివేదికల్లోనే స్పష్టం చేసిందన్నారు. జయ్ షాపై వచ్చిన ఆరోపణలన్నింటిని ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

 ప్రధాని మోదీ సీబీఐ, ఈడీలను ఆదేశిస్తారా? అని కపిల్ సిబాల్

ప్రధాని మోదీ సీబీఐ, ఈడీలను ఆదేశిస్తారా? అని కపిల్ సిబాల్

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్ షా సారథ్యంలోని కంపెనీపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్ చేశాయి. జయ్ షా వ్యవహారం ‘అశ్రిత పెట్టుబడి వ్యవస్థ' అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ అభివర్ణించారు. అమిత్‌షా తనయుడు జే షా వ్యాపార సంస్థ టర్నోవర్ ఒక్కసారిగా 80.5 కోట్లకు చేరుకున్నట్టు వచ్చిన కథనంపై కాంగ్రెస్ నేత కపిల్ సిబ్బల్ స్పందించారు. అధికారం దక్కిన తర్వాత కొందరి అదృష్టం కూడా మారిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. 'ఈరోజు నేను ప్రధాన్ సేవక్ (ప్రధాని)ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. దీనిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇస్తారా? సదరు వ్యక్తులను అరెస్టు చేయమని ఈడీని అడుగుతారా? అదే విపక్షాల విషయంలో అయితే ఈడీ వెంటనే నోటీసులు పంపుతూ అరెస్టు చేయడానికి తహతహలాడుతుంటుంది' అని ఆయన అన్నారు. జయ్ షా 60 శాతం వాటా గల కుసుమ్ ఫైనాన్సియల్ సంస్థ స్టాక్ ట్రేడింగ్‌లో ఉన్నా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గాలి మరల (పవన) విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎట్లా పొందగలిగిందని కపిల్ సిబాల్ నిలదీశారు.

 ప్రధాని మోదీ ఎలా మౌనంగా ఉన్నారన్న సీతారాం ఏచూరి

ప్రధాని మోదీ ఎలా మౌనంగా ఉన్నారన్న సీతారాం ఏచూరి

ఇది మోదీ హయాంలోని తాజాగా బయటపడిన అవినీతి కేసు అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. బిర్లా - సహారా డెయిరీ, జీఎస్పీసీఎల్, వ్యాపం, లలిత్ మోదీ, బియ్యం, మైనింగ్ కుంభకోణం తదితర కుంభకోణాల వరుసలో తాజాగా అమిత్ షా తనయుడిపై ఈ ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. అయినా ప్రధాని నరేంద్రమోదీ ఎలా మౌనంగా ఉన్నారని సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఇటీవల బీజేపీ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తాను అవినీతికి పాల్పడనని, ఇతరులను పాల్పడనివ్వనని పేర్కొనడం గమనార్హం.

 న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణకు సీపీఐ డిమాండ్

న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణకు సీపీఐ డిమాండ్

జయ్ షా సంస్థ లావాదేవీలపై న్యాయస్థానం పర్యవేక్షణలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలపై సీబీఐని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రయోగిస్తున్న బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు తన పార్టీ నేత కుటుంబ సభ్యుల సంస్థపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు చేయించడం లేదని త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఒబ్రెయిన్ ప్రశ్నించారు. ప్రస్తుతం మీడియాకు స్వేచ్ఛ అవసరం అని అభిప్రాయ పడ్డారు.

 లాభాలొచ్చే సంస్థలనెలా మూసేశారని సందేహం

లాభాలొచ్చే సంస్థలనెలా మూసేశారని సందేహం

ఈ అంశంపై క్రిమినల్ విచారణ చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిమాండ్ చేసింది. ఇదంతా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్ షా మనీ లాండరింగ్ వ్యవహారమేనని ఆప్ సీనియర్ నేత అశుతోష్ పేర్కొన్నారు. 2015 - 16లో రూ.80 కోట్ల ఆదాయం, అందులో రూ.51 కోట్ల విదేశీ ఆదాయం సముపార్జించిన సంస్థ.. మంచి లాభాలు గడించి పెట్టిన సంస్థ లావాదేవీలు ఆ మరుసటి సంవత్సరమే మూసివేయడం దిగ్భ్రాంతికరంగా ఉన్నదని అశుతోష్ అన్నారు. మంచి బిజినెస్ ఇస్తున్న సంస్థలు ఎందుకు మూసేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+