బారులో బీరు, మందుబాబులు బేజారు, సీఎంకు తిక్కరేగితే ఇంతే కథ !
మద్యం ఆరోగ్యానికి హానికరం, పొగతాగుట ఆరోగ్యానికి హానికరం అని ప్రతి సినిమా మొదలుకాక ముందేలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రచారం చేస్తున్నారు. అయితే మద్యం తాగే వారి సంఖ్య, పొగతాగేవారి సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. నెల రోజుల క్రితం బీరు ధర పెరిగింది. ఇప్పుడు మళ్లీ బీరు ధర పెరిగింది. బీరు తాగే మద్యం ప్రియుల జోబులు చిల్లులు పడుతోందని మందుబాబులు లబోదిబో అంటున్నారు.
బీరు తాగేవారికి మద్యం తయారీ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. కర్ణాటకలోకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ప్రియులకు షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. బీర్ కంపెనీలు నెల రోజుల క్రితమే బీర్ ధరను పెంచాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి వారంలో లిక్కర్ దరలు పెంచి మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చింది.

ఇప్పుడు ముడిసరుకు ధరలు పెరగడంతో మరోసారి మద్యం ధర పెరిగింది. నెల రోజుల క్రితమే పెంచారు. ఇప్పుడు బీరు ధరను మళ్లీ పెంచారు. ఒక్క బీరు బాటిల్ పై రూ. 10 నుంచి రూ. 20 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కర్ణాటకలో బీరు ధర పెంపు మద్యం ప్రియులకు షాక్ తగిలింది. గత 17 నెలల్లో ఐదోసారి బీరు ధర పెంచగా, ఇప్పుడు ముడిసరుకు ధరలు పెరగడంతో బీరు ధర పెంచినట్లు సమాచారం.
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీరు ధర రూ. 50 నుంచి రూ. 60కి పెరిగింది.గత గురువారం నుంచి కొన్ని కంపెనీల బీర్ల ధరలు పెరిగాయి. మరికొన్ని కంపెనీలు సవరించిన రేటు మంగళవారం, బుధవారం నుంచి అమల్లోకి రానుంది. అన్ని బ్రాండ్ల బీర్ ధరలు ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ. 20 వరకు పెరిగాయి.
గత ఫిబ్రవరిలో బీరు ధర రూ.10 పెరిగింది. ఇప్పుడు 15 నెలల్లో బీరు ధర రూ. 50 నుంచి రూ. 60 వరకు పెరిగింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తొలుత మద్యంపై సుంకాన్ని పెంచింది. తర్వాత వాణిజ్య వాహనాలపై రవాణా సెస్‌ను పెంచారు. ఇప్పుడు మళ్లీ బీర్లు, మద్యం ధరలు పెంచి మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చింది. అయితే పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే కర్ణాటకలోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయని కొందరు మద్యం వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ మీద సెటైర్లు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications