హైకోర్టులో హార్దిక్ పటేల్‌కు ఎదురు దెబ్బ
అహ్మదాబాద్: పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ కు గుజరాత్ హై కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన మీద నమోదైన దేశ ద్రోహం కేసును సవాలు చేస్తూ హార్దిక్ పటేల్ వేసిన పిటీషన్ ను గుజరాత్ హై కోర్టు కొట్టివేసింది.
సూరత్ పోలీసులు హార్దిక్ పటేల్ మీద దోశ ద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల పోరాటం కోసం పటేల్ యువకులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరాదని, అవసరమైతే పోలీసులను చంపాలని హార్దిక్ పటేల్ పిలుపునిచ్చాడు.

హార్దిక్ చేసిన వ్యాఖ్యలపై సూరత్ పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు. అదే విధంగా రాజ్ కోట్ లో జరిగిన భారత్- దక్షిణాఫ్రికా వన్డే క్రికెట్ మ్యాచ్ అడ్డుకోవడానికి వెళ్లిన సందర్బంలో జాతీయ జెండాను అవమానించారని మరో కేసు నమోదు అయ్యింది.
ఈ కేసులను సవాలు చేస్తూ హార్దిక్ పటేల్ గుజరాత్ హై కోర్టును ఆశ్రయించి పిటీషన్ వేశారు. మంగళవారం గుజరాత్ హై కోర్టు ఈ పిటీషన్‌ను కోట్టి వేసింది. కేసులు దర్యాప్తులోనే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. హార్దిక్ పటేల్ అనుచరులు సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications