వార‌ణాసిలో ఘోరం.. కూలిన రెండు ఇళ్లు.. ఎనిమిది మంది స‌జీవ స‌మాధి..

యూపీలోని వారణాసిలో ఘోర ప్రమాదం వెలుగుచూసింది. కాశీ విశ్వనాథుని ఆల‌య సమీపంలో నిన్న‌(సోమవారం) అర్థరాత్రి రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది స‌జీవ స‌మాధి కాగా, మ‌రో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని స‌మాచారం. చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోయా గల్లీ కూడలి వద్ద ఈ ప్రమాదం జ‌రిగింది. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, స్థానిక పోలీసు బృందాలు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని క్ష‌తగాత్రుల‌ను బ‌య‌టికి తీసే ప్ర‌య‌త్నాలు చేశాయి. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ప‌లువురిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం 4వ నెంబరు ద్వారం మూసివేయ‌బ‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. ఆల‌య సంద‌ర్శ‌నకు వ‌చ్చిన భ‌క్తుల కోసం గేట్ నంబర్ 1 , 2 నుండి ప్రవేశం ఇవ్వబడుతుంది. ఈ ప్ర‌మాద ఘ‌టనా స్థ‌లంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. గాయ‌ప‌డిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్న‌ట్లు స‌మాచారం. పోలీసులు ఇచ్చిన పూర్తి స‌మాచారం మేరకు..

The horror in Varanasi Two houses collapsed Eight people were buried alive

కూలిపోయిన రెండు ఇళ్లు రాజేష్ గుప్తా, మనీష్ గుప్తాల‌విగా తెలిపారు. ఈ ఇల్లులు సుమారు 70 ఏళ్ల నాటివ‌ని చెబుతున్నారు. అర్థరాత్రి స‌మ‌యంలో రెండు ఇళ్లు కూలిపోవ‌డంతో సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు విష‌యాన్ని చేర‌వేశారు. అధికారులకు సమాచారమిచ్చి వీధిలోకి వెళ్లే రహదారిని మూసివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు మైదాగిన్, గొదౌలియా నుండి ఆలయానికి వెళ్లే నాల్గవ నంబర్ గేట్ నుండి సందర్శకుల ప్రవేశ ద్వారాన్ని మూసివేశారు. ఘ‌ట‌నా స్థలంలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+