Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేను నల్లగా ఉంటే బిడ్డలు ఎర్రగా ఎలా పుడుతారు ?, భర్త డౌట్ తో భార్యకు !

చెన్నై/ మదురై: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. పిల్లలు పుట్టిన తరువాత ఇరు వైపుల కుటుంబ సభ్యులు కలిసిపోయారు. అయితే నేను చాలా నల్లగా ఉన్నానని, పిల్లలు మాత్రం ఎర్రగా పుట్టారని భర్తకు అతని భార్య మీద అనుమానం పెరిగిపోయింది. అక్రమ సంబంధం పెట్టుకుని తన భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యిందని ఆమె భర్త రగిలిపోయాడు.

తమిళనాడులోని మైలాదురై జిల్లాలోని కుతాలం సమీపంలోని ఆషికాడు గ్రామంలో అయ్యప్పన్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయ్యప్పన్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలో అఖిల ప్రియా అలియాస్ అఖిల అనే యువతి నివాసం ఉంటున్నది. అయ్యప్పన్, అఖిల ఒకే వీధిలో నివాసం ఉండటంతో ఇద్దరికి పరిచయం ఉంది.

The husband killed his wife because she had an illicit relationship and the children were born red in Tamil Nadu.
రానురాను అయ్యప్పన్, అఖిల ప్రేమించుకున్నారు. అయ్యప్పన్, అఖిల ప్రేమను వాళ్ల పెద్దలు వ్యతిరేకించారు. అయితే అఖిల ఆమె కుటుంబ సభ్యులను ఎదిరించి 2012లో ప్రియుడు అయ్యపన్ ను పెళ్లి చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుసుకున్న అయ్యప్పన్, అఖిల చాలా సంతోషంగా కాపురం చేశారు. ఇదే సమయంలో అఖిలకు ఓ కుమారుడు పుట్టాడు.

అయ్యప్పన్ చూడటానికి నల్లగా ఉంటాడు. తాను నల్లగా ఉన్నానని, తన కొడుకు ఎలా ఎర్రగా పుట్టాడని అయ్యప్పన్ కు డౌట్ వచ్చింది. తరువాత అఖిల కుటుంబ సభ్యులు, అయ్యప్పన్ కుటుంబ సభ్యులు రాజీ అయిపోయారు. తరువాత అఖిల మీద అయ్యప్పన్ కు అనుమానం వచ్చింది. తన భార్య అఖిలకు అక్రమ సంబంధం ఉందని, అందుకే బిడ్డ ఎర్రగా పుట్టాడని అనుమానం పెంచుకున్నాడు.

The husband killed his wife because she had an illicit relationship and the children were born red in Tamil Nadu.

రెండు సంవత్సరాల తరువాత అఖిల కూతురు తల్లి అయ్యింది. కూతురు కూడా చాలా ఎర్రగా పుట్టడంతో అయ్యప్పన్ కు అతని భార్య అఖిల మీద ఇంకా ఎక్కువ అనుమానం వచ్చింది. తన భార్యకు నిజంగానే అక్రమ సంబంధం ఉందని, అందుకే ఇద్దరు పిల్లలు ఎర్రగా పుట్టారని అయ్యప్పన్ రగిలిపోయాడు. అయితే అఖిల ఎర్రగా ఉందని, అందుకే పిల్లలు ఎర్రగా పుట్టారని బంధువులు చెప్పినా అయ్యప్పన్ మాత్రం అతని భార్య మీద అనుమానంతో బతికాడు.

ప్రతిరోజు పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న అయ్యప్పన్ అతని భార్య అఖిలను పట్టుకుని చితకబాదడం మొదలుపెట్టాడు. పెద్దలు రాజీ చేసినా అయ్యప్పన్ మాత్రం పద్దతి మార్చుకోలేదు. భార్య మీద విపరీతమైన అనుమానం పెంచుకున్న అయ్యప్పన్ 2020 జులై 18వ తేదీన తాడుతో అఖిల గొంతు బిగించాడు.

The husband killed his wife because she had an illicit relationship and the children were born red in Tamil Nadu.

ఆ సందర్బంగా అఖిల కేకలు వెయ్యడంతో అయ్యప్పన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కుటుంబ సభ్యులు అఖిలను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై అఖిల చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో అయ్యప్పను అరెస్టు చేశారు. అఖిల తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో ఎఫ్ఐఆర్ సమర్పించారు.

18 మంది సాక్షులను విచారణ చేసిన కోర్టు వారి నుంచి వివరాలు సేకరించారు. అఖిల అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త అయ్యప్పన్ ఆమెను హత్య చేశాడని కోర్టులో నేరం రుజువు అయ్యిందని, అయ్యప్పన్ కు వ్యతిరేకంగా సాక్షాలు ఉన్నాయని, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 1, 000 జరిమానా విధిస్తున్నామని మైలాడుదురై కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

కోర్టు యావజ్జీవ శిక్ష విధించడంతో నిందితుడు అయ్యప్పన్ ను తిరుచ్చి సెంట్రల్ జైలుకు తరలించామని మైలాడుదురై జిల్లా పోలీసులు తెలిపారు. బిడ్డలు ఎర్రగా పుట్టారని భార్య అఖిల మీద అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్త అయ్యప్పన్ కు యావజ్జీవ శిక్షపడటంతో అఖిల కుటుంబ సభ్యులు మాకు న్యాయం జరిగిందని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+