Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్యూటీపార్లల్ ముసుగులో నా భార్య అలా చేస్తోందా ?, అర్దరాత్రి చంపేసి పార్క్ లో నిద్రపోయిన భర్త !

ఒకే చోట పని చేస్తున్న మహిళకు, మరో వ్యక్తికి పరిచయం అయ్యింది కొంతకాలం స్నేహితులుగా ఉన్న తరువాత ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. బ్యూటీపార్లల్ కు వెలుతున్న భార్య బాయ్ ఫ్రెండ్స్ లో ఫుల్ బిజీ అయిపోయింది. భార్య అక్రమ సంబందాల గురించి తెలుసుకున్న భర్త రగిలిపోయాడు. భార్యను నీట్ గా చంపేసిన భర్త పార్క్ లోకి వెళ్లి హాయిగా నిద్రపోయాడు.

అక్రమ సంబంధానికి సంబంధించి జరిగిన గొడవలో భార్యను ఆమె భర్త హతమార్చిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని నెలమంగళ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన నెలమంగళ తాలూకాలోని గోరినబెలె గ్రామంలో జరిగింది, భాగ్యమ్మ అలియాస్ భాగ్య (33) అనే మహిళను ఆమె భర్త రమేష్ (35) హత్య చేసి చేతులు దులుపుకోవాలని ప్లాన్ చేశాడని పోలీసు అధికారులు తెలిపారు.

The husband killed his wife who was enjoying having an illicit relationship and went to the park to sleep near Bengaluru
స్టార్ హీరో భార్యకు లీగల్ ప్రాబ్లమ్ ?, ఆ నటి ప్రైవేట్ ఫోటోల విషయంలో ?, ఎవరికి నష్టం ?

మైసూర్‌లో జన్మించిన భాగ్య అక్కడే పెరిగింది. ఐదు సంవత్సరాల క్రితం నిందితుడు రమేష్‌ని మైసూరులోని హనుమంతు పలావ్ బిర్యానీ హోటల్‌లో అనుకోకుండా భాగ్య కలిసింది. హనుమంతు పలావ్ సెంటర్ అంటే మైసూరు నగరంతో పాటు కర్ణాటకలో చాలా ఫేమస్. ఆ తరువాత భాగ్య, రమేష్ స్నేహితులు అయ్యారు. రానురాను భాగ్య, రమేష్ దగ్గర అయ్యారు. ఆ తర్వాత నాలుగేళ్ల క్రితం ప్రేమించుకున్న రమేష్ భాగ్య తరువాత పెళ్లి చేసుకున్నారు.

తరువాత దంపతులు గోరినబెలెలో నివసించడం మొదలుపెట్టారు. భాగ్య ఓ బ్యూటీపార్లర్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం ఉందని సమాచారం. భాగ్య అక్రమ సంబంధాల గురించి తెలుసుకున్న ఆమె భర్త రమేష్ కొన్ని రోజులుగా అతని భార్యతో గొడవ పడుతున్నట్లు సమాచారం.ఇదే విషయంలో గొడవలు ఎక్కువ కావడంతో భాగ్య మైసూరుకు వెళ్లిపోయి అక్కడే ఉండటం మొదలుపెట్టింది.

అయితే తనతో కాపురం చేస్తూనే వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకున్న భాగ్య ఎంజాయ్ చేస్తోందని, బ్యూటీపార్లల్ ముసుగులో బయటకు వెలుతున్న తన భార్య కామం తీర్చుకుంటున్నదని రమేష్ రగిలిపోయాడు. ఎలాగైన భాగ్యను హత్య చేసి చేతులు దులుపుకోవాలని రమేష్ ప్లాన్ చేశాడు. భాగ్యను మైసూరు నుంచి రమేష్ నెలమంగలోని ఇంటికి పిలుచుకుని వచ్చాడు. గురువారం రాత్రి ఇద్దరి మధ్య అక్రమ సంబంధం విషయంలోనే గొడవ జరిగింది.

The husband killed his wife who was enjoying having an illicit relationship and went to the park to sleep near Bengaluru
నా మొగుడి జోలికి వస్తే నీ అంతుచూస్తా, నటికి స్టార్ హీరో భార్య వార్నింగ్, సిగ్గుంటే ఆ ఫోటోలు?

ఆ సమయంలో కత్తి తీసుకున్న రమేష్ అతని భార్య భాగ్య గొంతు కోసి హత్య చేశాడు. భాగ్యను హత్య చేసిన అనంతరం నిందితుడు రమేష్ నెలమంగళ పట్టణంలోని టౌన్ పార్కులోకి వెళ్లి అక్కడే పడుకుని హాయిగా నిద్రపోయాడు. గస్తీ తిరుగుతున్న పోలీసులు నిద్రపోతున్న రమేష్ చేతికి రక్తపు మరకలు ఉన్న విషయం చూసి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు.

పోలీసుల విచారణలో తన భార్య భాగ్యను హత్య చేసినట్లు రమేష్ అంగీకరించాడని సమాచారం. భాగ్యకు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని, ఆమె భర్తను వదిలేసిందని తెలిసింది. రమేష్ కు కూడా ఇంతకు ముందే పెళ్లి చేసుకున్నాడని, అతను భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అక్రమ సంబంధం కారణంగా భార్యను చంపేసి హ్యాపీగా భర్త పార్క్ లో నిద్రపోయాడని తెలుసుకున్న నెలమంగల ప్రజలు షాక్ అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+