స్టార్ హీరో భార్యకు లీగల్ ప్రాబ్లమ్ ?, ఆ నటి ప్రైవేట్ ఫోటోల విషయంలో ?, ఎవరికి నష్టం ?
ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పెద్ద తుఫానులో చిక్కుకున్నాడు. తన జీవితంలో పదే పదే సమస్యలను ఎదుర్కొన్న నటుడు దర్శన్ ఇప్పుడు ఆయన భార్య విజయలక్ష్మి, పవిత్రా గౌడల పోరులో చిక్కుకోవడంతో ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ పవిత్రా గౌడ ఫోటో, ఆమె కూతురు ఫోటోని షేర్ చేయడంతో దర్శన్ భార్య విజయలక్ష్మి ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడ్డారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దర్శన్ భార్య విజయలక్ష్మి విషయంలో న్యాయ నిపుణులు ఏమంటున్నారు?, దర్శన్ భార్య పవిత్రా గౌడపై ఇప్పుడు కేసు పెడితే దర్శన్ భార్య విజయలక్ష్మి మీద కూడా ఎలాంటి కేసులు పెట్టోచ్చు అనే చర్చ జోరుగా మొదలైయ్యింది. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ భార్య విజయలక్ష్మి పై పవిత్రా గౌడ న్యాయపోరాటం ప్రారంభిస్తే పెద్ద సమస్యే ఎదురవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా దర్శన్ భార్య విజయలక్ష్మి నటి పవిత్రా గౌడ కుమార్తె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పాప ఫోటోతో పాటు పవిత్రా గౌడకు సంబంధించిన ఓ ప్రైవేట్ ఫోటో కూడా విజయలక్ష్మి షేర్ చేశారు. దీంతో విజయలక్ష్మికి పెద్ద సమస్యే మొదలవుతుందని అంటున్నారు. ఒకవేళ ఈ కేసు ఏదైనా సందర్బంలో కోర్టు మెట్లెక్కితే దర్శన్ భార్య విజయలక్ష్మికి చట్టపరమైన సమస్యలు ఎదురౌతాయని న్యాయనిపుణులు అంటున్నారు. చట్టప్రకారం ఒకరి ఫోటో మరొకరు ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఆ ఫోటోలు ఎక్కడా ప్రచురించరాదు. అలాగే సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకూడదు.

ముఖ్యంగా ఒకరి ప్రైవేట్ ఫోటోలను ఈ విధంగా దుర్వినియోగం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో పిల్లల ఫోటోల విషయంలో చట్టం మరింత కఠిన చర్యలు తీసుకోనుంది. కాబట్టి ఈ కేసులో ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందో అని దర్శన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రా గౌడ్ పై విజయలక్ష్మి కేసు పెడితే తిరిగి విజయలక్ష్మి మీద పవిత్రా గౌడ కేసు పెడితే పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ముందుగా మా పరువు తీశారంటూ పవిత్రా గౌడ దర్శన్ భార్య విజయలక్ష్మీ మీద పరువునష్టం దావా వేయొచ్చు. ఇప్పుడు కూడా పవిత్రా గౌడ స్వయంగా ఆరోపించినట్లుగా తన కుమార్తె ఫోటోను పోస్ట్ చేసిన వ్యక్తిపై చట్ట ప్రకారం కేసు కూడా దాఖలు చేయవచ్చు. జువైనల్ యాక్ట్ కింద కేసు పెట్టే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. అమ్మాయి ఫోటోతో పాటు అసభ్య వ్యాఖ్యలతో పోస్టులు చెయ్యడంతో అలాంటి పోస్టులు చేసిన వ్యక్తులు న్యాయపరమైన సమస్యలను కూడా ఎదుర్కొంటారు.
ఐటీ చట్టం కింద కేసు పెడితే విజయలక్ష్మికి ఇంకా ఎక్కువ సమస్యలు ఎదురౌయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. వీటన్నింటితో పాటు విజయలక్ష్మి మీద ఐటీ యాక్ట్ కింద కేసు పెట్టే అవకాశం ఉందని, బెదిరింపు, మానసికంగా హింసించడం వంటి అభియోగాల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. దీంతో నటుడు దర్శన్ జీవితంలో మరోసారి అలజడి మొదలైయ్యింది

అయితే దీనిపై ఇప్పటి వరకు స్యాండిల్ వుడ్ హీరో, చాలెంజింగ్ స్టార్, డి బాస్ దర్శన్ ఏ విధంగా స్పందించలేదు. విజయలక్ష్మి, పవిత్రా గౌడల మధ్య మొదలైన ఈ పోరు ఎక్కడ ముగుస్తుంది? అనే ప్రశ్నలపై జోరుగా చర్చ జరుగుతుంది. అభిమానులు డి బాస్ అని ముద్దుగా పిలుచుకునే హీరో దర్శన్‌కి రోజురోజుకు కుటుంబ సమస్యలు ఎదురవుతున్నాయి. కుటుంబ కలహాలే దర్శన్ సినిమా జీవితానికి పెద్ద అడ్డంకిగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి గురువారం నటి పవిత్రా గౌడకు వార్నింగ్ మెసేజ్ పంపింది. ఇన్ని పరిణామాల మధ్య ఈరోజు పవిత్రా గౌడ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి ని హెచ్చరించింది. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య న్యాయ పోరాటం మొదలవుతుందా? అన్న చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. మొత్తం మీద హీరో దర్శన్ మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది.
-
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
ఈ అడవిలోని చెట్ల మధ్య దాగి ఉన్న జంతువును కనిపెట్టగలరా..? -
అవి చూశాక ఎంతో బాధనిపిస్తోంది.. సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్. -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications