రైలు పట్టాల మీద భార్యను గట్టిగా పట్టుకుని సారీ చెప్పిన భర్త, వెనుక నుంచి రైలు వచ్చి ?
వారణాసి/లక్నో: భర్త (husband) విపరీతంగా మద్యపానం సేవించడంతో విసిగిపోయిన ఓ భార్య (wife) ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే ట్రాక్ దగ్గర నిలబడి ఉంది. అనంతరం ఆమెను ఓదార్చేందుకు వెళ్లిన భర్త ఇక ముందు ఇలాంటి తప్పు చెయ్యను, మద్యం సేవించను అంటూ బోరున విలపించి అతని భార్యను కౌగిలించుకున్నాడు. భార్య (wife) ఆత్మహత్య అడ్డుకోవడానికి ఆమె భర్త ప్రయత్నిస్తాడు.
అయితే అదే సమయంలో వేగంగా మరోవైపు నుంచి రైలు వేగంగా వచ్చి ఢీకొనడంతో దంపతుల ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అలాంటి దారుణ ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) వారణాసిలో చోటుచేసుకుంది. వారణాసిలోని (varanasi) సారనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచకోషి రైల్వే క్రాసింగ్ వద్ద బుధవారం రాత్రి (night)ఈ ఘటన జరిగినట్లు పోలీసులు సమాచారం అందించారు.

గోవింద్ సోంకర్ (30) అనే యువకుడు మద్యానికి బానిసైనాడు. రాత్రి గోవింద్ విపరీతంగా మద్యం సేవించాడు. దీనిపై గోవింద్ భార్య ఖుష్బు సోంకర్ (28) అభ్యంతరం తెలిపారని సారనాథ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బ్రిజేష్ కుమార్ సింగ్ తెలిపారు. మద్యం మత్తులో ఉన్న గోవింద్ అతని భార్య (wife) ఖుష్బుతో గొడవకు దిగాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటానని ఖుష్బు రైలు పట్టాల దగ్గరకు వెళ్లింది.
హడలిపోయిన గోవింద్ అతని భార్య (wife)ఖుష్బును ఓదార్చడానికి రైలు పట్టాల దగ్గరకు పరుగుతీశాడు. అయితే భార్య ఖుష్బుకు నచ్చ చెబుతున్న సమయంలో మరో వైపు నుంచి వేగంగా వచ్చిన రైలు ఢీకొని ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు (daughter) , ఒక కొడుకు (son)ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం వారణాసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications