ఒకేఒక్క చాన్స్ ఇవ్వండి: పాక్ ఉగ్రవాదులను బూడిద చేస్తాం: ఆర్మీ
న్యూఢిల్లీ: మాకు ఆరు నెలలు గడువు ఇవ్వండి, పాక్ అక్రమిత కాశ్మీర్ లో ఒక్క ఉగ్రవాది కనపడకుండా మొత్తం బూడిద చేసేస్తాం అని భారత్ ఆర్మీ అంటున్నది. ఈ ఒకేఒక్క చాన్స్ ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు భారత్ ఆర్మీ చెప్పిందని తెలిసింది.
పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఉగ్రవాదాన్ని కూకలివేళ్లతో పెకిలిస్తామని భారత్ ఆర్మీ సవాలు చేసింది. సర్జికల్ స్ట్రైక్ దాడులతో ఏడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత్ ఆర్మీ మొత్తం పాక్ అక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయాలని నిర్ణయించింది.
పాక్ ఉగ్రవాదులు అందరూ పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లోనే తలదాచుకున్నారని భారత్ ఆర్మీ పసిగట్టింది. పాక్ సైన్యం సహకారంతో ఉగ్రవాదులు భారత్ సరిహద్దుల్లోకి చొరబడుతున్నారని, భారత్ సైనికులపై దాడులు చేస్తున్నారని చెప్పింది.

ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు మిలటరీ అధికారులు కేంద్ర ప్రభుత్వ నాయకులతో అనధికారికంగా మాట్లాడుతూ మాకు ఆరు నెలల అవకాశం ఇవ్వాలని, పాక్ అక్రమిత కాశ్మీర్ లో ఒక్క ఉగ్రవాది కనపడకుండా చేస్తామని చెప్పారు.
ఉగ్రవాదులకు పునరావాసం లేకుండా చేస్తే పాక్ చచ్చినట్లు దారికి వస్తుందని చెప్పారని తెలిసింది. సర్జికల్ స్ట్రైక్ దాడులు మరన్ని చేస్తే ఉగ్రవాదులు భారత్ సరిహద్దులోకి వచ్చే అవకాశం లేదని చెప్పారని సమాచారం.
పాక్ అక్రమిత కాశ్మీర్ లో 50కి పైగా ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని భారత సైన్యం పసిగట్టింది. అందులో సుమారు 250 మంది ఉగ్రవాదులు ఉంటారని, వారికి పాక్ సైన్యం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భారత్ సైన్యం కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందని తెలిసింది.












Click it and Unblock the Notifications