వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబాయి నుండి సిరియా వెళ్ళిన ఆమన్ చనిపోయాడు. ధృవీకరించిన ఐఎస్

ముంబాయిలోని కళ్యాణి ప్రాంతం నుండి సిరియాకు వెళ్ళి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరిన అమన్ టాండెల్ మరణించినట్టుగా ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై :ముంబాయిలోని కళ్యాణి ప్రాంతం నుండి సిరియాకు వెళ్ళి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరిన అమన్ టాండెల్ మరణించినట్టుగా ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఈ మేరకు అమన్ అమరుడయ్యాడంటూ ఇస్లామిక్ స్టేట్ అధికారిక మీడియా ఛానల్ ఖిలాఫా న్యూస్ ప్రకటించింది.

ముంబాయికి చెందిన ఆమన్ ఇస్లామిక్ స్టేల్ లో చేరాడు. ఆమన్ తో పాటు విదేశాల నుండి వచ్చి తమ తరపున పోరాడుతూ ఆమన్ మరణించాడని ఖిలాఫా వార్త సంస్థ ప్రకటించింది. ఆమన్ రక్కా ప్రాంతంలో మరణించినట్టు తెలిపింది.

the islamic state has confirmed the death of kalyn boy aman tandel

ఆమన్ చనిపోయినట్టు అతని కుటుంబసభ్యులకు గత మాసంలోనే సమాచారం వచ్చింది. అయితే భద్రత దళాలు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఇస్లామిక్ స్టేట్ ధృవీకరణతో ఈ అంశం తేటతెల్లమైంది.

2014 లో ఇరాక్ లోని పవిత్ర ప్రాంతాలను సందర్శించేందకు వెళ్థున్నట్టుగా కళ్యాణి ప్రాంతం నుండి ఆమన్ తో పాటు మరో ముగ్గురు సిరియాకు వెళ్ళి ఇస్లామిక్ స్టేట్ లో చేరారు. ఈ ఏడాది తొలినాళ్ళలో విడుదలచేసిన వీడియోలో ఆమన్ తో అతని మిత్రడు ఇండియాలో ముస్లింలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకొంటామని హెచ్చరించారు.

ఆమన్ తో పాటు వెళ్ళిన ముగ్గురిలో నహీమ్ టంకీ గతంలోనే మరణించాడు. అరీబ్ మజీద్ గత ఏడాది ఇండియాకు వచ్చి విచారణను ఎదుర్కొంటున్నాడు. మరో వ్యక్తి షేక్ ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ తరపున పోరాటం చేస్తున్నాడు.

English summary
the islamic state has confirmed the death of kalyn boy aman tandel who had joined the ranks of the terrorist organaisation in syria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X