రూ. వేల కోట్ల కాంట్రాక్టు: బినామీ కంపెనీ పేరుతో కాంగ్రాస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేకి?
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గీతా మహదేవ ప్రసాద్ మీద ఆదాయపన్ను శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు. బినామి కంపెనీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గీతా మహదేవ ప్రసాద్ కాంట్రాక్టు తీసుకున్నారని ఆరోపణలు రావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక రాష్ట్ర మంత్రిగా పని చేస్తున్న సమయంలో మహదేవ ప్రసాద్ గుండెపోటుతో మరణించారు. ఆయన సతీమణి గీతా మహదేవ ప్రసాద్ తరువాత జరిగిన గుండ్లుపేట నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపోందారు. గీతా మహదేవ ప్రసాద్ కు మంత్రి పదవి గ్యారెంటీగా ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సందర్బంలో రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 193 కర్ణాటక గిడ్డంగుల భవనాల మీద రూఫ్ టాప్ సోలార్ కేంద్రాలు ఏర్పాటు చేసే కాంట్రాక్టును గీతా మహదేవ ప్రసాద్ బినామీ పేరుతో తీసుకున్నారని బెంగళూరు నగరానికి చెందిన ఎస్.టి. మూర్తి అనే సామాజిక కార్యకర్త ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

100 మెగావ్యాట్ల ఉత్పత్తి చేసే రూఫ్ టాప్ సోలార్ కేంద్రాలు ఏర్పాటు చేసే కాంట్రాక్టును 25 ఏళ్ల వరకు గీతా మహదేవ ప్రసాద్ బినామీ పేరుతో తీసుకున్నారని ఆరోపించారు. కేవలం రూ. 18 లక్షలు చెల్లించిన గీతా మహదేవ ప్రసాద్ రూ. 2,500 కోట్ల విలువైన కాంట్రాక్టులు తీసుకున్నారని, ఈ విషయంపై విచారణ జరిపించాలని మూర్తి ఫిర్యాదు చెయ్యడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.












Click it and Unblock the Notifications