వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులు అక్రమంగా వచ్చారు..విద్యార్ధులపై దాడి చేసారు: చర్యల కోసం హెఆర్డీకి.. జామియా ఫిర్యాదు..!

|
Google Oneindia TeluguNews

జామియా యూనినవర్సిటీలో పోలీసుల ప్రవేశం పైన అధికారులు కేంద్ర మానవ వనరుల శాఖకు నివేదిక అందచేసి..న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ఈ నెల 15..16 తేదీలలో జరిగిన ఘటనల పైన ఈ నెల 20న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు నివేదిక ఇచ్చారు. దీని పైన చర్యలు తీసుకోవాలని అందులో అభ్యర్ధించారు. ఆ నివేదికలో వర్సిటీ పరిధిలో టియర్ గ్యాస్ వినియోగించారని..లాఠీఛార్జ్ చేసారని వివరించారు. జామియా రిజిస్టార్ ఇచ్చిన ఈ నివేదికలో అసలు ఆ రెండు రోజుల్లో విద్యార్దులు ఎక్కడ గుమి గూడారు..ఏం జరిగిందనేది పూర్తిగా వివరాలతో నివేదించారు.

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 15న విద్యార్ధులు ఆందోళన చేస్తున్న సమయంలో లైబ్రరీ వద్ద బయటి వ్యక్తులు ఉన్నారనే కారణంగా పోలీసులు ఆరోపించారు. అప్పటికే పెద్ద ఎత్తున వచ్చిన నిరసన కారులను తరిమేందుకు పోలీసులు యూనివర్సిటీ క్యాంపస్ లోకి ప్రవేశించారు. గేటు నెంబర్లు 4, 7 ద్వారా లోపలకు ప్రవేశించి గార్డులను కొట్టారని పేర్కొన్నారు. టియర్ గ్యాస్ ఉపయోగిస్తూ లైబ్రరీలో ఉన్న విద్యార్దులతో దురుసుగా వ్యవహరించారని నివేదికలో పేర్కొన్నారు.

The Jamia has submitted a fresh report to the HRD Ministry

చూపు కోల్పోయిన విద్యార్ధి..
క్యాంపస్ లోపలకు వచ్చేందుకు పోలీసులకు అనుమతి లేదని..లైబ్రరీ వద్దకు రాకూడదని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. రెచ్చగొట్టకపోయినా పోలీసులు అమాయక విద్యార్ధుల మీద విరుచుకుపడ్డారని నివేదికలో స్పష్టం చేసారు. పోలీసులు విచక్షణా రహితంగా కొట్టటంతో అనేక మంది విద్యార్ధులు చేతులు..కాళ్లకు దెబ్బలు తిగాలని..ఒక విద్యార్ధి కంటి చూపు కోల్పోయరాని..లాఠీతో దాడి చేయటం వలనే కంటి కి దెబ్బ తగలి చూపు కోల్పోయారని అధికారులు నివేదించారు. దీంతో..అప్పటి వరకు లా అండ్ ఆర్డర్ మీద నమ్మకంతో ఉన్న విద్యార్ధులను ఒక్కసారిగా ఈ ఘటన కలవరానికి గురి చేసిందని పేర్కొన్నారు. అసలు..వర్సిటీ పరిధిలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించటం పైన చర్యలు తీసుకోవాలని కమిటీలో కోరారు.

భైతిక దాడులపైనా విచారణ చేయాలి
అదే విధంగా పోలీసులు విద్యార్ధుల మీద చేసిన దాడుల మీద విచారణ చేయించాలని అధికారులు నివేదికలో అభ్యర్ధించారు. లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్ధులతోనూ పోలీసులు దురుసుగా వ్యవహరించా రని వివరించారు. వర్సిటీ పరిధిలోని లైబ్రరీ..అదే విధంగా వర్సిటీ పరిధిలోని అనేక భాగాలు పోలీసుల దాడులతో డామేజ్ అయ్యాయని పేర్కొన్నారు. పార్కింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాలు సైతం దెబ్బ తిన్నా యని విశ్లేషించారు.

ఈ మొత్తం వ్యవహారం పైన కాల పరిమితితో కూడిన విచారణ కమటీని ఏర్పాటు చేయాలని వర్సిటీ అధికారులు కేంద్రాన్ని నివేదికలో కోరింది. తాజగా, శుక్రవారం జాతీయ మానవ హక్కుల సంఘం క్యాంపస్ ను సందర్శించింది. వర్సిటీ అధికారులు వీరికి సైతం విచారణ చేయాలని లేఖ రాసింది. అదే విధంగా వర్సిటీ యాజమాన్నయం దక్షిణ రేంజ్ సంయుక్త పోలీసు కమిషనర్ కు సైతం లేఖ రాసింది. అందులో తాము ఫిర్యాదు చేసినా..చర్యలు తీసుకోని అంశాన్ని స్పష్టం చేసింది.

English summary
The Jamia Millia Islamia has submitted a fresh report to the HRD Ministry requesting judicial inquiry into the entry of police on the university premises
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X