క్వాష్ పిటీషన్ ను తిరస్కరించిన హైకోర్టు, అక్రమాస్తుల కేసులో సీబీఐకి గ్రీన్ సిగ్నల్, నాయకుడి కథ !
బెంగళూరు: అక్రమ ఆస్తుల కేసులో కేపీసీసీ (KPCC) అధ్యక్షుడు, కర్ణాటక ( Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ (CBI)విచారణకు కర్ణాటక హైకోర్టు (High Court) అనుమతి ఇవ్వడంతో ఆయన అభిమానులు ఉలిక్కిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు (DK Shivakumar) మళ్లీ కష్టాలు ఎదురయ్యాయని ఆయన అభిమానులు, అనుచరులు అంటున్నారు.
తన మీద నమోదు అయిన అక్రమాస్తుల కేసుపై సీబీఐ దర్యాప్తును రద్దు చేయాలంటూ డీకే శివకుమార్ (DK Shivakumar)దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఇటీవల పూర్తి చేసిన కర్ణాటక హైకోర్టు (High Court) తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గురువారం డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టు (High Court) తీర్పు వెల్లడించింది. తన మీద నమోదు అయిన అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ నిలిపివేయాలని డీకే శివకుమార్ (DK Shivakumar)వేసిన క్వాష్ పిటీషన్ ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.

ఇప్పటికే సీబీఐ అధికారులు డీకే శివకుమార్ (DK Shivakumar) మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని, విచారణ దాదాపుగా పూర్తి అయ్యే దశంలో ఉందని, ఇలాంటి సమయంలో ఆయన మీద నమోదు అయిన కేసును రద్దు చేస్తే సీబీఐ విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని సీబీఐ తరపున న్యాయవాది కర్ణాటక హైకోర్టులో (High Court)వాదించారు. వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు డీకే శివకుమార్ (DK Shivakumar) మీద సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
2020 అక్టోబరు 3వ తేదీన అక్రమాస్తులు సంపాదించిన కేపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై (DK Shivakumar) అవినీతి నిరోధక చట్టం 1988లోని పలు సెక్షన్ ల కింద సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. 2023 నుండి 2018 మధ్య కాలంలో డీకే శివకుమార్ (DK Shivakumar) ఆదాయానికి మించి ఆస్తులు సంపాధించారని సీబీఐ (CBI)ఆరోపించింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ డీకే శివకుమార్ కర్ణాటక హైకోర్టును (High Court)ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన కర్ణాటక హైకోర్టు సీబీఐ విచారణకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇటీవల సీబీఐకి ఇచ్చిన స్టేని హైకోర్టు (High Court)పొడిగించింది. ఇప్పుడు హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను కూడా కర్ణాటక హైకోర్టు (High Court) రద్దు చేసి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్న కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు (DK Shivakumar) సీబీఐ విచారణతో మళ్లీ చిక్కు వచ్చిపడింది.












Click it and Unblock the Notifications