వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర రాజకీయాల వెనక ఆ మహిళ..! ఊహించని మలుపులు అందుకేనా..!??

|
Google Oneindia TeluguNews

ముంబాయి/హైదరాబాద్ : తల్లి ప్రేమకు కొలమానం ఉండదు. తన సంతానం సురక్షితంగా ఉంగాలని కోరుకోవడమే కాక, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అందుకోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అచ్చం ఇలాంటి సంఘటనలే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆదిత్య ఠాక్రేను మహారాష్ట్ర సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని ఆమె ఉడుం పట్టు బట్టిన నేపథ్యంలోనే ఇప్పుడు శివసేన రాజకీయాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఐతే కుమారుడి పట్ల ఉన్న అతి ప్రేమ రాజకీయ శూన్యతకు తెరలేపుతున్నాయి. కుటుంబ వ్యవహారాలు రాజకీయాలను ఎంత ప్రభావితం చేస్తున్నా, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవాలి గానీ, తెగే దాకా లాగితే పరిస్థితి ఇలాగే ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

మహారాష్ట్ర మహాట్విస్ట్! ఎన్నికలకు ముందే బీజేపీ ప్లాన్-బీ సిద్ధం చేసిందా? అసలేం జరిగిందంటే.?మహారాష్ట్ర మహాట్విస్ట్! ఎన్నికలకు ముందే బీజేపీ ప్లాన్-బీ సిద్ధం చేసిందా? అసలేం జరిగిందంటే.?

మహారాష్ట్ర రాజకీయాలు మలుపుతిప్పుతున్న మహిళ..! ఉద్దమ్ ఠాక్రే పై తీవ్ర ఒత్తిడి..!!

మహారాష్ట్ర రాజకీయాలు మలుపుతిప్పుతున్న మహిళ..! ఉద్దమ్ ఠాక్రే పై తీవ్ర ఒత్తిడి..!!

శివసేన వ్యవస్థాపకుడు స్వర్గీయ బాల్ ఠాక్రే, మహారాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ పార్టీ సొంతంగా అధికారం చేపట్టకపోయినా, మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగలిగే పార్టీగా శివసేనకు పటిష్టమైన పునాదులను నిర్మించగలిగారు సర్గీయ బాల్ ఠాక్రే. ఇక తన తర్వాత శివసేన పగ్గాలు చేపట్టిన ముఖ్యనేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎదిగేలా చేసిన బాల్ ఠాక్రే ఆశించినట్లుగానే పార్టీని ఆయన లీడ్ చేస్తూ వచ్చారు. మొన్నటి వరకూ మహారాష్ట్రను పాలించిన బీజేపీ, శివసేన కూటమిలో శివసేనకు సముచిత స్దానం దక్కిందని చెప్పొచ్చు. ఐతే శివ సేనకు సీఎం పదవి గానీ, డిప్యూటీ సీఎం పదవి గానీ దక్కలేదు. తాజా ఎన్నికలకు ముందు తన బలం మరింతగా పెరిగిందని భావించిన ఉద్ధవ్, కూటమి అధికారంలోకి వస్తే సీఎం పీఠాన్ని సమంగా పంచుకుందామని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

కుమారున్ని సీఎం చేయండి..! ఉద్దమ్ భార్య రష్మీ ఒత్తిడి..!!

కుమారున్ని సీఎం చేయండి..! ఉద్దమ్ భార్య రష్మీ ఒత్తిడి..!!

ఉద్ధవ్ ఠాక్రే తన మాటకు అంతలా కట్టుబడి ఉండడానికి కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన సతీమణి రష్మీ ఠాక్రే తన ముద్దుల కుమారుడిని ఎలాగైనా సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలనే ఒత్తిడిని తెస్తున్నన్నట్టు తెలుస్తోంది. తన సతీమణి కోరిక మేరకు తన కుమారుడిని సీఎంగా చూసుకోవాలని ఉద్దమ్ ఠాక్రే కూడా గట్టిగానే నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతే కాకుండా రష్మీ తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు పైన హితబోధ చేయడం విశేషం. భార్యాభర్తలు కలిసి తమ చిరకాల కోరికను తీర్చుకునేందుకు ఆదిత్యను ఎన్నికలకు ముందే రంగంలోకి దించేశారు. పార్టీలో కీలక నేతగా ఎదిగేలా వ్యూహాలు అమలు చేశారు. అనుకున్నట్లుగానే ఆదిత్య కూడా సత్తా చాటి సీఎం పదవి చేపట్టే స్తోమత తనకుందని కూడా నిరూపించేసుకున్నారు. ఇదంతా తల్లి శిక్షణాగా చర్చ జరుగుతోంది.

అంచనాలకు మించి ఎదిగిన ఆదిత్యా..! కాని అది సరిపోదంటున్న రాజకీయాలు..!!

అంచనాలకు మించి ఎదిగిన ఆదిత్యా..! కాని అది సరిపోదంటున్న రాజకీయాలు..!!

యువతలో ఉన్న సానుకూల వాతావరణాన్ని క్యాష్ చేసుకుంటూ ఆదిత్య పార్టీకి మరిన్ని మంచి ఫలితాలు అందించారు. అయితే బీజేపీని నిలువరించే స్థాయిలో మాత్రం సీట్లను శివసేన సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఉద్దవ్ ప్రతిపాదనను బీజేపీ కొట్టిపారేయగా, రష్మీ మాత్రం తన కుమారుడిని సీఎం చేయాల్సిందేనని తనదైన శైలిలో భర్తపై ఒత్తిడి తెస్తుండడంతో, ఆ దిశగానే ఉద్ధవ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతు శివసేనకు దక్కిన నేపథ్యంలో సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే అయితే పరవాలేదు గాని, అనుభవం లేని ఆదిత్యను సీఎంగా ఆ రెండు పార్టీలు ఒప్పుకోలేదని చర్చ జరుగుతోంది. అయినా కూడా రష్మీ తన పట్టుదలను మాత్రం వీడ లేదని సమాచారం.

గుమ్మం ముందు వరకూ వచ్చిన సీఎం పదవి..! మెట్టు దిగితే ఉద్దమ్ సీఎం అయ్యే వాడు..!!

గుమ్మం ముందు వరకూ వచ్చిన సీఎం పదవి..! మెట్టు దిగితే ఉద్దమ్ సీఎం అయ్యే వాడు..!!

మహా రాజకీయాల్లో చర్చోపచర్చలు కొన సాగుతుండగానే, బీజేపీ తనకు అనుకూలంగా వ్యూహాన్ని మలచుకుని ఎన్సీపీని చీల్చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తంగా కుమారుడిని సీఎంగా చూసుకోవాలన్న వాదనపై రష్మీ కాస్తంత తగ్గి ఉంటే, బీజేపీ ముందువెనకా చూసుకునే లోపుగానే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టేదని, ఉద్దవ్ సీఎం అయ్యేవారన్న కథనాలు వినిపిస్తున్నాయి. అంటే... రష్మీ పట్టుదల కారణంగానే కూటమి సర్కారు ఏర్పాటు ఆలస్యం కాగా, బీజేపీ అవకాశాన్ని చేజిక్కించుకుందన్న చర్చ కూడా జరుగుతోంది. అంటే మహా రాష్ట్ర రాజకీయాలు మహా మలుపులు తీసుకోవడానికి ఓ మహిళ కారణం కావడం పట్ల దేవ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

English summary
In the wake of the Shiv Sena's support for the NCP and Congress parties, the lead is Udav Thakre, but it is a debate that the two parties did not agree with the inexperienced Aditya. Even then, Aditya mother Rashmi is so perticular on her son Aditya"s cm post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X