వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడుల కోసం ‘యాప్’ రూపొందించిన లష్కరే తొయిబా

|
Google Oneindia TeluguNews

ఉగ్రవాదులు కూడా ప్రస్తుత సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. పాకిస్థాన్ మద్దతుతో భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోన్న హఫీజ్ సయీద్, తన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తొయిబాకు సొంతంగా ఓ యాప్‌ను తయారు చేయించారు.

దీని ద్వారా తమ కార్యకలాపాలు నిఘా సంస్థలు కనిపెట్టకుండా జాగ్రత్తపడుతున్నారు.లష్కర్ ఎ తొయిబాలో ఉన్న 20 మంది సైబర్ సెల్ ఉగ్రవాదులు ఈ యాప్ తయారు చేశారు.

ఈ యాప్ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవడం, ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపుకోవచ్చు. జమ్ముకాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో పట్టుబడిన పాక్ ఉగ్రవాది నవేద్ కూడా ఇదే యాప్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.

The Lashkar-e-Taiba and its technological advancements

నవేద్ అరెస్ట్ అనంతరం ఈ యాప్ గురించి వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఈ యాప్ ద్వారా లష్కర్ ఎ తొయిబాకు సహకరిస్తున్న వారి వివరాలు ఎన్‌ఐఏ అధికారులకు తెలిసినట్లు సమాచారం.

ఆ తర్వాతే కాశ్మీర్ లోయలో లష్కర్ ఎ తొయిబా కమాండర్ అబూ ఖాసింకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ యాప్‌కు సంబంధించిన సర్వర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉంది. దాడులకు ప్రణాళికలు వేసేవారికి, వాటిల్లో పాల్గొనే వారికే ఈ యాప్ గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు.

English summary
Terrorists too update themselves on the technology front. First a private server to find the need (Pakistan set up private servers for terrorists) and now a common application to communicate between each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X