Metro: మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్‍పై 25 శాతం సబ్సిడీ ..
మెట్రో రైలు ప్రయాణికులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముంబై మెట్రో రైళ్లలో ప్రయాణించేవారికి 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శనివారం ప్రకటించారు. మే 1 నుంచి 65 ఏళ్లు పైబడిన పౌరులు, దివ్యాంగులు, 12వ తరగతి వరకు విద్యార్థులు మే 1 నుంచి రాయితీపై మెట్రో లైన్ 2A, 7లో ప్రయాణించవచ్చని తెలిపారు. మే 1 మహారాష్ట్ర దినోత్సవంగా సందర్భంగా ఈ ప్రకటన చేశారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ముంబై వన్) ఉన్న వేల మంది హోల్డర్లకు ఈ ప్రయోజనం వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
45 లేదా 60 ట్రిప్పులకు ముంబై వన్ పాస్‌లపై మాత్రమే డిస్కౌంట్ వర్తిస్తుంది. 2A, 7 మెట్రో లైన్‌లను మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMMOCL), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) నిర్వహిస్తోంది. మెట్రో 2A (పసుపు లైన్) అంధేరీ వెస్ట్‌లోని దహిసర్ E, DN నగర్‌లను కలుపుతుంది. లైన్ 7 అంధేరి E, దహిసర్ E (రెడ్ లైన్) మధ్య నడుస్తుంది. ఈ 25 శాతం రాయితీ పొందాలంటే.. దివ్యాంగులు వైకల్యానికి సంబంధించి ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు అందజేయాలి.

సీనియర్ సిటిజన్లు కూడా వయస్సు కు సంబంధించి ధృవీకరణ పత్రం చూపించాలి. విద్యార్థులు రాయితీకి అర్హత పొందేందుకు పాఠశాల IDతో పాటు వారి లేదా వారి తల్లిదండ్రుల పాన్ కార్డును చూపించాల్సి ఉంటుంది. ఈ పత్రాలను లైన్ 2A మరియు 7 రూట్‌లోని ఏదైనా టికెట్ విండోలో చూపించవచ్చు. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ మెట్రో మాత్రం రాయితీ ఎత్తివేశారు. రద్దీ సమయాల్లో రాయితీని ఎత్తి వేశారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్‌పై ఇప్పటి వరకు ప్రయాణ ఛార్జీల్లో 10శాతం డిస్కౌంట్ ఇచ్చేవారు.
అలాగే హైదరాబాద్ మెట్రో కొత్తగా షార్ట్ ట్రిప్పులు అందుబాటులోకి తెచ్చింది. అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం వైపు వెళ్లాల్సిన ప్రయాణికులు నాగోల్ నుంచి వచ్చే ట్రైన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం వరకు ఈ షార్ట్ ట్రిప్పులు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మెట్రో నెట్‌వర్క్ ఉన్న అన్ని నగరాల్లో ప్రయాణికుల రద్దీ ఒక సాధారణ అంశమని హెచ్‌ఎంఆర్ ఎల్ అండ్ టీ పేర్కొంది. నగరంలో ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉందని, ముఖ్యంగా రాయదుర్గం వైపు వెళ్లే రైళ్లలో ఇది కనిపిస్తోందని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications