మనుషుల్ని చంపి తింటున్న ఆ మ్యాన్ ఈటర్ మృతి.. ట్విస్ట్ ఏంటంటే!

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల ఒక మహిళ పైన దాడి చేసి చంపిన పులిని కేరళ ప్రభుత్వం మ్యాన్ ఈటర్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ పులి మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. నేడు తెల్లవారుజామున పులి కళేబరాన్ని అటవీ ప్రాంతంలో గుర్తించినట్టు వారు పేర్కొన్నారు.

మ్యాన్ ఈటర్ గా మారిన పులి మృతి
మ్యాన్ ఈటర్ గా మారిన పులిని చంపాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించడంతో దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పులి ఎక్కడ ఉందో దాని ఉనికిని గుర్తించామని అధికారులు తెలిపారు. ఆపై ఈరోజు తెల్లవారుజామున దాని కళేబరం గాయాలతో దొరికిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

The man-eater tiger who killed and ate people died shocking twist in tiger death

కాఫీ తోటలో పని చేస్తున్న మహిళను చంపి తిన్న పులి
పులి శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా మరో క్రూర మృగం దాడిలో అది మరణించి ఉంటుందని అనుమానిస్తున్నామని వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకారియా తెలిపారు.ఇదిలా ఉంటే ఇటీవల వయనాడ్ లోని మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తున్న రాధా అనే మహిళ పైన పెద్దపులి దాడి చేసింది. పెద్దపులి దాడిలో రాధ మరణించింది. రాధ మృతదేహం లో కొంత భాగాన్ని పులి తినేసింది.

పులి దాడులతో భయపడుతున్న ప్రజలు
ఈ క్రమంలోనే అటవీ శాఖ అధికారి జయసూర్య పైన పులి దాడికి పాల్పడింది. ఇలా పులి వరుసగా మనుషుల పైన దాడులకు పాల్పడుతూ నరమాంసాన్ని తినడానికి అలవాటు పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఇటీవల పులులు ఎక్కడ చూసినా ప్రజలు భయపడుతున్నారు. దీంతో పులులు సంచరిస్తున్నట్టు ప్రజలు నివేదించిన అన్ని ప్రాంతాలలో అటవీ శాఖ అధికారులు క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టారు.

నరమాంస భక్షక పులి కోసం గాలింపు.. మరణించిన పులి
కేరళ అటవీ శాఖ మంత్రి ఏకే శశింద్రన్ ఈ నర మాంసభక్షక పులి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మనుషులను తినేస్తున్న పులిని చంపేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పులి తాజాగా మరో క్రూరం మృగం దాడిలో చనిపోయినట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+