పన్నీర్, పళనిసామి చర్చలు విఫలం: మీ కోర్కెలు తీర్చలేం: రివర్స్ గేర్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు ఒక్కటి కావాలని చేసిన ప్రయత్నాలు బెటిసికొట్టాయి. ఒక వర్గం మీద మరో వర్గం ప్రత్యక్షంగా ఆరోపణలు చేసుకోవడంతో గత నాలుగు రోజుల నుంచి ఒక్కటి కావాలనుకుంటున్న రెండు వర్గాల ప్లాన్ తారుమారైయ్యింది.

తమిళనాడు సీఎం రాజీనామా ! తల పట్టుకున్న ఎడప్పాడి పళనిసామి

రెండు వర్గాలు కలిసిపోకుండా ఇటు శశికళ కుటుంబ సభ్యులు తెర వెనుక పావులు కదుపుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం దక్కించుకోవడానికి పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గం ఒక్కటి కావాలని నిర్ణయించారు. అయితే అది సాధ్యం అయ్యేపని కాదని సమాచారం.

ఎవరిమాట వినరు

ఎవరిమాట వినరు

పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి వర్గంలోని నాయకులు వారివారి డిమాండ్లను మీడియా ముందు చెప్పడంతో వీరి వ్యవహారం బెడిసికొట్టిందని సమాచారం. అయితే పన్నీర్ సెల్వం వర్గం వెనక్కి తగ్గకపోవడంతో ఎడప్పాడి పళనిసామి వర్గీయులు అయోమయంలో పడిపోయారు.

సీనియర్ మంత్రి తంగమణి

సీనియర్ మంత్రి తంగమణి

ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని మంత్రులు సీనియర్ మంత్రి తంగమణి ఇంటిలో గురువారం సాయంత్రం సమావేశం అయ్యారు. ఎలాగైనా పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులను చర్చలకు అహ్వానించి ఇరు వర్గాలు ఒక్కటి కావాలని మంతనాలు జరిపారు.

జరిగే పనేనా అంటూ

జరిగే పనేనా అంటూ

పన్నీర్ సెల్వం వర్గం చేస్తున్న డిమాండ్లను తీర్చడం సాధ్యం అయ్యే పనేనా అంటూ పలువురు మంత్రులు తంగమణి ఇంటిలో చర్చించారు. శశికళ, దినకరన్ లను పార్టీ నుంచి బహిష్కరించినా పన్నీర్ సెల్వం వర్గం ఎందుకు నమ్మడం లేదని అంటున్నారు.

మీడియా ముందుకు మంత్రులు

మీడియా ముందుకు మంత్రులు

ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు తంగమణి తదితరులు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ మరో సారి బహిరంగంగా పన్నీర్ సెల్వం వర్గానికి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.

రెండు డిమాండ్లు అంటే

రెండు డిమాండ్లు అంటే

జయలలిత మరణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, శశికళ, దినకరన్ లను పార్టీ నుంచి బహిష్కరించామని అధికారికంగా ప్రకటించాలని, వారి దగ్గర రాజీనామా లేఖలు తీసుకోవాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నది.

రెండు విచారణలో ఉన్నాయి

రెండు విచారణలో ఉన్నాయి

జయలలిత మరణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఇప్పటికే కోర్టులో కేసు విచారణలో ఉందని, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక విషయం ఎన్నికల కమిషన్ దగ్గర విచారణలో ఉందని, ఈ రెండు విషయాల్లో ఇప్పుడు మేము ఏం చెయ్యలేమని, తరువాత ఈ విషయాలపై మాట్లాడుదాం అని సీనియర్ మంత్రి తంగమణి తదితరులు మీడియా ముందు పన్నీర్ వర్గానికి క్లారిటీ ఇచ్చారు.

సీఎం పదవి కావాలని ఎవరు అడిగారు

సీఎం పదవి కావాలని ఎవరు అడిగారు

పన్నీర్ సెల్వం తనకు సీఎం పదవి ఇవ్వాలని ఎవరిని అడిగారు, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై లేనిపోని విషయాలు తెరమీదకు తీసుకు వచ్చి ఆయన స్థాయికి తగ్గి మాట్లాడుతున్నారని పన్నీర్ వర్గంలోని మాజీ మంత్రి కేపీ. మునిసామి మండిపడ్డారు.

చివరి అవకాశం ఇదే

చివరి అవకాశం ఇదే

మేము చేస్తున్న రెండు డిమాండ్లు అంగీకరిస్తేనే మీతో కలవడానికి ముందుకు వస్తామని పన్నీర్ సెల్వం వర్గం తేల్చి చెప్పడంతో ఎడప్పాడి పళనిసామి వర్గం ఉలిక్కిపడింది. జయలతి మరణంపై సీబీఐ విచారణ కేసు కోర్టులో ఉందని, శశికళకు పార్టీ పదవి అప్పగించిన విషయం ఎన్నికల కమిషన్ దగ్గర విచారణలో ఉందని, ఆరెండు విషయాల్లో తాము ఇప్పుడు ఏమీ చెయ్యలేమని ఎడప్పాడి పళనిసామి వర్గం అంటోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The merger move of two factions of the Anna Dravida Munnetra Kazhagam was failed. Edappadi Palanichami team is try to avoid OPS team as they are demanding more and important postings.
Please Wait while comments are loading...