ఆపరేషన్ సింధూర్ పేరు ఖరారు చేసిన మోదీ - ఆ మహిళల ఆక్రందనలకు ప్రతీకారం..!!

ఆపరేషన్ సింధూర్. అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడులతో ఉగ్రవాద శిబిరాలు నేల మట్టం అయ్యాయి. పాక్ తో పాటుగా పీఓకేలో గురి పెట్టి సమయం చూసి భారత వాయు సేన చేసిన దాడు లతో ఒక్క సారిగా దేశం మొత్తం తెలియని ఎమోషన్ కనిపించింది. పహల్గాంలో సామాన్యులను మతం పేరుతో దుర్మార్గంగా కాల్చి చంపిన ముష్కరుల పైన మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఆపరేషన్ కు సింధూర్ పేరు వెనుక ఒక ఎమోషన్ ఉంది. కొత్త పెళ్లైన జంటలు పహల్గాం లో ఉన్న సమయంలో భార్యల ముందే భర్తలను పాశవికంగా కాల్చి చంపారు. మహిళల నుదట సింధూరానికి ప్రతీకగా ఇప్పుడు ఈ ఆపేషన్ కు ఇదే పేరు ఖరారు చేసారు.

ప్రధాని మోదీ ఆపరేషన్
పహల్గాం ఉగ్ర దాడి తరువాత టెర్రరిస్టులను వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. గత పది రోజులుగా త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఉగ్రవాదులను తుది ముట్టించే ఆపరేషన్ కు స్కెచ్ సిద్దం చేసారు. కావాల్సిన అన్ని సన్నాహక చర్యలు తీసుకున్నారు. అర్ద్రరాత్రి ఆపరేషన్ సింధూర్ కు ముహూర్తం ఖరారు చేసారు. సరిగ్గా అర్ద్రరాత్రి 1.44 గంటలకు పాక్ తో పాటుగా పీఓకే లోని టెర్రర్ క్యాంక్స్ పైన భారత వాయు సైన్యం విరుచుకుపడింది. మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. పీఓకేలోని అయిదు.. పాక్ లోని నాలుగు శిబిరాల ను నేలమట్టం చేసింది. లష్కరే తోయిబా స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. అర్ద్రరాత్రి ఈ దాడుల కోసం ప్రధాని కార్యాలయంలోనే ముహూర్తం ఖరారు చేసారు.

the-name-sindoor-for-the-operation-carries-its-own-significance

మెరుపు దాడులతో
భారత్ మెరుపు దాడులతో పాక్ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంది. ఆపరేషన్ సింధూర్‌ను ప్రధాని మోదీ రాత్రంతా పర్యవేక్షించారు. వార్‌రూమ్ నుంచి ఆయన లైవ్‌లో వీక్షించారు. ప్రతీ అప్‌డేట్‌ను మినిట్ టూ మినిట్ అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఆయా స్థావరాలను విజయవంతంగా కూల్చేయడంతో ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రస్థావరాలు నేలమట్టం కాగానే 'జైహింద్' అంటూ డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను, వారి సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసినట్లు తెలిసింది. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు నిర్వహించారు. భారత సైన్యం దాడులను పాకిస్థాన్‌ సైన్యం నిర్ధారించింది. భారత్‌ దాడి చేసిందని ప్రకటించింది. కోట్లి, ముజఫరాబాద్‌, బహవల్‌పూర్‌లపై మిసైల్స్‌తో దాడులు చేసినట్లు పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడినట్లు వెల్లడించారు.

దిక్కు తోచని పాక్
భారత్ మెరుపు నిర్ణయాలతో పాక్ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లింది. అమెరికాతో ఏకరువు పెట్టింది. సరిహద్దు నుంచి 30 కిలో మీటర్ల దూరంలోని ఉగ్రవాద శిబిరాలను సైన్యం టార్గెట్ చేసింది. పాక్ నుంచి ఎలాంటి ప్రతి స్పందన వచ్చినా ఎదుర్కోవటానికి భారత్ సిద్దంగా ఉంది. కాగా, ఇవాళ 11 కేంద్ర క్యాబినెట్ కమిటీ భేటి కానుంది. ఈ సమావేశానికి ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ జరగనుంది. ఆపరేషన్ సింధూర్, పాక్ ప్రతిదాడులు, యుద్ద సన్నద్దతపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపు నివ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక.. ఉగ్రవాద శిబిరాల పైన మెరుపు దాడులను విజయవంతంగా పూర్తి చేసిన సైన్యానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+