పార్లమెంట్ కొత్తభవనం జాతికి అంకితం చేసే చారిత్రాత్మక ఘట్టం; షారూక్ ఖాన్ ఆసక్తికర ట్వీట్!!
దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈరోజు ఉదయం యజ్ఞం, పూజ లతో మొదలయ్యే ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంతో ముగియనుంది. ప్రారంభోత్సవానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ చూసినట్లయితే 7:30 నిమిషాలకు యజ్ఞాన్ని ప్రారంభించారు. దీనికోసం గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సంకేతంగా చేస్తున్న ఈ యజ్ఞానికి ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరవుతారు. ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల మధ్య తమిళనాడుకు చెందిన బంగారపు చారిత్రాత్మక సెంగోల్ ను స్పీకర్ చైర్ వద్ద ప్రతిష్టించడం జరుగుతుంది.

ఆపై ఉదయం 9:00 నుండి 9:30 నిమిషాల వరకు ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించి పార్లమెంట్ నూతన భవన ఆవిష్కరణ సందర్భంగా శంకరాచార్యుల తో సహా పలువురు పండితులు సాధువులు ప్రార్ధన సమావేశాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ గీతంతో రెండవదశ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా రెండు షార్ట్ ఫిల్మ్ లు ప్రదర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, రాష్ట్రపతిద్రౌపది ముర్ము సందేశాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చదివి వినిపించనున్నారు.
లోక్సభ స్పీకర్ కూడా ప్రసంగించనున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగానికి అవకాశం కల్పించినప్పటికీ, ఈ వేడుకను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడంతో ఆయన ప్రసంగించే చాన్స్ లేదు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సందర్భంగా 75 రూపాయల స్మారక నాణేన్న్నిని నేడు విడుదల చేయనున్నారు. చివరిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంతో కార్యక్రమం ముగుస్తుంది.
What a magnificent new home for the people who uphold our Constitution, represent every citizen of this great Nation and protect the diversity of her one People @narendramodi ji.
— Shah Rukh Khan (@iamsrk) May 27, 2023
A new Parliament building for a New India but with the age old dream of Glory for India. Jai Hind!… pic.twitter.com/FjXFZwYk2T
ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తాజాగా పార్లమెంట్ కొత్త భవనం వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. పార్లమెంట్ నూతన భవనాన్ని ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ లో మన దేశ రాజ్యాంగాన్ని గౌరవించే వారి కోసం ఇదో అద్భుతమైన ఇల్లు అని పేర్కొన్నారు. ఈ భవనం ప్రతి భారత పౌరుడుకి ప్రాతినిధ్యం వహిస్తుందని, పార్లమెంట్ కొత్త భవనం కొత్త భారత్ కోసమంటూ షారుక్ ఖాన్ ట్వీట్ చేశారు.
-
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
IPL 2026 Second Phase Schedule: ఐపీఎల్ రెండో విడత షెడ్యూల్-50 మ్యాచ్ ల తేదీలివే..! -
స్వదేశంలో టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే..! బీసీసీఐ షెడ్యూల్ ప్రకటన..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications