Ration Card: రేషన్ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయం.. మే 1 నుంచి అమలు..!

దేశంలో ఉన్న పేదవారికి ఆహారం అందించేందుకు రేషన్ కార్డులను జారీ చేశారు. రేషన్ కార్డులతో పేదలకు నెలనెలా బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయి. అందుకే రాష్ట్రంతో పాటు దేశంలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే రేషన్ కార్డు పొందిన వారిలో లక్షల్లో అనర్హులు ఉన్నారు.

రేషన్ కార్డు తీసుకున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు కూడా ఉన్నారు. అంతే కాదు భారీగా భూమి ఉన్నవారికి కూడా రేషన్ కార్డు ఉంది. దీంతో వీరు ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. దీంతో అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డులు తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. అర్హత లేకున్నా అక్రమంగా రేషన్ కార్డులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోనుంది.

The new rules regarding ration cards will be implemented from May 1

ఇందుకు సంబంధించిన నిబంధనలను మే 1 నుంచి అమలు చేయనున్నారు. అలాగే చాలా మంది రేషన్ కార్డులో ఉన్న వారు లేకున్నా వారి పేరుపై రేషన్ తీసుకుంటున్నారు. దీని కోసం రేషన్ ఈ కేవైసీ కూడీ తీసుకొచ్చారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఈ కేవైసీ చేసుకోలేని వారి పేరును రేషన్ కార్డుల నుంచి తొలగించే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకుంది. అంతేకాకుండా మీసేవ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించింది. అధికారులు ప్రస్తుతం దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. జూన్ లో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+