పఠాన్ కోట్ దాడి: మౌలానా మసూద్ పై చార్జ్ షీట్
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రవాదుల దాడి చేసిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జిషీటు దాఖలు చేసింది. పాకిస్థాన్ కు చెందిన జైష్-ఏ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ప్రధాన నిందితుడు అని సోమవారం ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది.

మౌలానా మసూద్ అజర్ తో పాటు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అస్గర్, షహీద్ లతీఫ్ అనే నిందితుల పేర్ల చార్జ్ షీట్ లో దాఖలు చేశారు. అదేవిధంగా నాసీర్ హుస్సేన్, హఫీజ్ అబు బకర్, ఉమర్ ఫరూఖ్, అబ్దుల్ ఖయ్యూం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మౌలానా మసూద్ అజర్ రెచ్చగొట్టడం వలనే పఠాన్ కౌట్ ఎయిర్ బేస్ మీద దాడి జరిగిందని ఎన్ఐఏ అధికారులు చార్జీషీట్ లో పొందుపరిచారు. 2011 పార్లమెంట్ మీద జరిగిన దాడి కేసులో మౌలానా మసూద్ అజర్ ప్రధాన నిందితుడు అని తెలిసిందే.












Click it and Unblock the Notifications