• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇక ముసలితనం అంత తొంరగా రాదు..! సింగపూర్ శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం..!!

|

హైదరాబాద్ : వయసు పై బడుతున్న ప్రతి వ్యక్తి యవ్వనంగా కనిపించాలని ఆరాటపడుతుంటాడు. వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులను అస్సలు అంగీకరించరు. యవ్వనంగా కనిపించడానికి అనేక నూతన మార్గాలను అణ్వేషిస్తుంటాడు మానవుడు. అంతే కాకుండా మనిషి జీవితంలో బాల్యం, కౌమారం, య‌వ్వ‌నం, వృద్దాప్యం.. ఈ నాలుగు ద‌శ‌ల్లో దేనిక‌దే ప్ర‌త్యేకతను చాటుకుంటాయి. మరుపురాని మరిచిపోలేని, మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. బాల్యం జ్ఞాపకాలను మిగిలిస్తే, కౌమారం పరిపక్వతను తీసుకొస్తుంది. య‌వ్వ‌నం బాధ్య‌త‌ల‌ను గుర్తు చేస్తుంది. కానీ వృద్ధాప్యం మాత్రం భ‌యాన్నిక లిగిస్తుంది.

 ఇక వృద్యాప్యం లేటుగా వస్తుంది.. వినూత్న ప్రయోగాలు చేస్తున్న సింగపూర్ శాస్త్రజ్ఞులు..

ఇక వృద్యాప్యం లేటుగా వస్తుంది.. వినూత్న ప్రయోగాలు చేస్తున్న సింగపూర్ శాస్త్రజ్ఞులు..

ప్రపంచంలో చావును నేరుగా గెలిచే శ‌క్తి ఏదీ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు అందుబాటులో లేదు. అయితే మ‌నిషి జీవితంలో చివ‌రి ద‌శ‌గా ఉన్న వృద్ధాప్యాన్ని మాత్రం జ‌యించ‌వ‌చ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. వృద్ధాప్యం పై ఎలాంటి దిగులు లేకుండా జీవించ‌వచ్చ‌ని, అది శరీరం మీద అంత తొందరగా ప్రభావం చూపించకుండా, దాన్ని ఆలస్యం చేయొచ్చ‌ని స్పష్టం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎప్పటికీ యవ్వనంతో ఉండిపోతే ఎంత బాగుండో అని క‌ల‌లు క‌నేవారు లేక‌పోలేదు. 40 ఏళ్లు దాటితే చాలు, చాలా మందికి వృద్ధాప్యంలో అడుగుపెడుతున్నామా అనే ఆలోచనలు మొదలవుతాయి. ఎప్పుడో వచ్చే దాని గురించి చిలవలు పలవలుగా ఆలోచించి, ఆలోచించి ఇప్పటి నుంచే ఉన్న కాస్త ప్రశాంతతను కూడా దూరం చేసుకుంటారు.

 వయసు పైబడుతుందని దిగులు అవసరం లేదు.. 50 దాటినా యవ్వనంగా కనిపించొచ్చు..

వయసు పైబడుతుందని దిగులు అవసరం లేదు.. 50 దాటినా యవ్వనంగా కనిపించొచ్చు..

అయితే ఇలా అభద్రతా భావానికి లోనవుతూ మదనపడుతున్న వారికోసం పెద్ద ఉపశమనం కలిగించే వార్త బయటకొస్తోంది. వయసైపోతుందని తెగ బాదపడే వారికోసం శాస్త్రవేత్తలు ఓ శుభ‌వార్త తీసుకొచ్చారు. వృద్ధాప్యాన్ని పూర్తిగా దూరం చేయలేక పోయినా, వృద్యాప్యం అంత తొందరగా శరీరం మీద ప్రభావం చూపకుండా కాస్త ఆలస్యంగా వచ్చేందుకు ఏం చేయాలో చిట్కా కనిపెట్టారు. ఈ క్రమంలో సింగపూర్‌లోని నన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది.

 యవ్వనంగా ఉండేందుకు ప్రయోగాలు.. ఎలుకల మీద చేసిన ప్రయోగం విజయవంతం..

యవ్వనంగా ఉండేందుకు ప్రయోగాలు.. ఎలుకల మీద చేసిన ప్రయోగం విజయవంతం..

మనిషి ఇంటెస్టైన్స్ లో (పేగుల్లో) ఉండే సూక్ష్మ జీవులు, జీవ క్రియలు, పోషకాహారం, మనస్తత్వం, ప్రవర్తనపై ప్రభావం చూపిస్తాయి. ఇవి బ్యుటిరేట్ అనే ఫ్యాటీ యాసిడ్‌ను విడుదల చేస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్ దీర్ఘాయువుకు కారణమయ్యే ఎఫ్‌జీఎఫ్21 అనే హార్మోన్ ఉత్పత్తికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. జీవ క్రియల తీరును గాడిలో పెట్టడం ద్వారా ఈ హార్మోన్‌ ఉత్పత్తయ్యేలా చూసుకుంటే వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరకుండా అడ్డుకోవచ్చని పరిశోధనకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ పెటెర్సన్ తెలిపారు. వయసు పెరగడం వల్ల బ్యుటిరేట్ ఉత్పత్తి తగ్గుతుందని, ఫలితంగా శరీరం దుర్బరంగా మారుతుందని పేర్కొన్నారు.

 హార్మోన్ల ఉత్పత్తిని పెంపొందించుకోవాలి..!వృద్యాప్యం వాయిదా వేసుకోవచ్చంటున్న వైద్యులు..!!

హార్మోన్ల ఉత్పత్తిని పెంపొందించుకోవాలి..!వృద్యాప్యం వాయిదా వేసుకోవచ్చంటున్న వైద్యులు..!!

మానవాళి తీసుకునే ఆహారంలో కొద్దిపాటి జాగ్రత్తల ద్వారా బ్యుటిరేట్ స్థాయుల్ని పెంచుకోగలిగితే వృద్ధాప్యం ఆలస్యమవుతుందని వారు వివరించారు. ఇదే ప్రయోగం మానవాళి మీద ప్రయోగించినప్పుడు ఆశించిన ఫలితం ఇస్తే చాలా మందికి యాభై, అరవై ఏళ్లు దాటినా వృద్యాప్యం కనపడకుండా యవ్వనంగా ఉండొచ్చనే చర్చ వినిపిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఇది వందకు వంద శాతం శుభవార్తగా ప్రచారం జరుగుతోంది. సౌందర్యాన్ని అపురూపంగా భావించే సగటు బారత మహిళ, వృద్దాప్యం తొందరగా రాకుండా చేసే ప్రయోగం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

English summary
The old age symptoms will come late if the experiment is success, without affecting the body. In this order, scientists at Nanyang Technical University in Singapore succeeded in experimenting with rats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X