బీజేపీలోకి మైనింగ్ కింగ్ రెడ్డి, మోదీతో ఢీల్ ? తెరవెనుక చక్రం తీప్పుతున్న లీడర్ ఎవరు ?

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే సొంత పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి వేరేవేరే పార్టీల్లో చేరిపోయిన కొందరు ప్రముఖ నాయకులను మళ్లీ బీజేపీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటకలో రాజకీయాల్లో చక్రం తప్పి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కారణం అయిన నాయకుల్లో ఒక్కరైన గాలి జనార్దన్ రెడ్డి మరోసారి వార్తలో నిలిచారు.

మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి, కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరతారనే పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో స్వయంగా గాలి జనార్దన్ రెడ్డి సోమవారం కట్టి విరగకుండా, పాము చావకుండా అనే టైపులో సూచనప్రాయంగా సమాధానం వెల్లడించారు. కేఆర్‌పీ పార్టీ వ్యవస్థాపకుడు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన చేసిన ప్రకటన ఆశ్చర్యానికి గురి చేసింది.

The party high command is preparing to induct Gali Janardhan Reddy into the BJP ?

కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీని గుడ్ బై చెప్పి గత శాసన సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ మళ్లీ బీజేపీలో చేరిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సైలెంట్‌గా రంగం సిద్దం చేస్తున్నారని తెలిసింది. ఈ వార్తలకు మద్దతు ఇచ్చినట్లు మాజీ మంత్రి, కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది.

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతిస్తానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పడం అందర్ని ఆశ్చర్యపరిచింది. అయితే బీజేపీలో చేరే విషయమై ఎలాంటి చర్చలు జరగలేదని గాలి జనార్దన్ రెడ్డి ఇదే సందర్బంలో చెప్పారు. బీజేపీతో పొత్తుకు సిద్ధమని గతంలోనే గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం జగదీష్ షెట్టర్‌ను తనవైపు తిప్పుకోవడంలో బీజేపీ పార్టీ ఇప్పటికే విజయం సాధించింది. అలాగే గాలి జనార్దన్ రెడ్డిని కూడా బీజేపీలో చేర్చుకునేలా ప్లాన్‌ వేశారని తెలిసింది.

కేఆర్‌పీసీ వ్యవస్థాపకుడు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిని మళ్లీ బీజేపీలోకి తీసుకురావడానికి తెరవెనుక భారీగా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అందుకు కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు బళ్లారి శ్రీరాములు రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఇటీవల కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్ప మీడియాకు క్లూ ఇచ్చారు. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, విధానపరిషత్‌ మాజీ సభ్యుడు ఆయనూరు మంజునాథ్‌ తదితరులు మళ్లీ బీజేపీలో చేరుతారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

ఈవిషయాల గురించి కూడా బీజేపీ హైకమాండ్ తో చర్చిస్తున్నామని. పార్టీని వీడిన వారిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, బీజేపీలో కొత్తవారు కూడా చేరతారని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు. అయితే గాలి జనార్దన్ రెడ్డికి ఆయనస్థాపించిన కేఆర్పీపీ పార్టీని బీజేపీలో విలీనం చేసిన తరువాత కొప్పల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని బీజేపీ ప్లాన్ వేసినట్లు బీజేపీకి చెందిన కొందరు నాయకులు చెబుతున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌పై గాలి జనార్ధన్ రెడ్డి అభిప్రాయం మారిపోయింది. అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన గాలి జనార్దన్ రెడ్డి త్వరలో బీజేపీలో కేఆర్ పీపీని విలీనం చేసే అవకాశం ఉందని తెలిసింది. అయితే సొంత పార్టీని గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో విలీనం చేస్తారా ?, బయట నుంచి మద్దతు ఇస్తారా ? అనే విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకా కొన్ని రోజులు వేచిచూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+