బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశ ద్రోహి: ఎస్పీకి పాలిగ్రాఫ్ పరిక్షలు (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

చండీగడ్: పఠాన్ కోట్ ఉగ్రదాడి విషయంలో గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ కు పాలిగ్రాఫ్ పరిక్షలు నిర్వహించాలని జాతీయ భద్రతా దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు భావిస్తున్నారు. ఆయన నుంచి పూర్తి వివరాలు సేకరించాలంటే ఈ పరిక్షలు కచ్చితంగా చెయ్యాలని అంటున్నారు.

పాకిస్థాన్ కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు దాడి చేసి తన కారు ఎత్తుకెళ్లారని సల్వీందర్ సింగ్ పై అధికారులకు చెప్పిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు తన సెల్ ఫోన్ లాక్కోవడంతో సరైన సమయంలో పై అధికారులకు సమాచారం ఇవ్వలేకపోయానని అన్నారు.

తాను పఠాన్ కోట్ సమీపంలోని ప్రార్థనా మందిరం దగ్గరకు వెలుతుంటానని, అక్కడికి వెళ్లి వస్తుంటే తన కారును హైజాక్ చేశారని సల్వీందర్ సింగ్ నాటకాలు ఆడారు. అయితే ప్రార్థనా మందిరం కేర్ టేకర్ సైతం తాను ఎస్పీ సల్వీందర్ సింగ్ ను ఎన్నడూ చూడలేదని కచ్చితంగా చెప్పారు.

మొదటి సారి

మొదటి సారి

తాను మొదటి సారి 2015 డిసెంబర్ 31వ తేదిన సల్వీందర్ సింగ్ ను చూశానని ప్రార్థనా మందిరం కేర్ టేకర్ సోమ్ పోలీసు అధికారులకు చెప్పారు.

నీలిరంగు సైరన్ లైటు

నీలిరంగు సైరన్ లైటు

వ్యక్తిగత వాహనాలకు నీలి రంగు సైరన్ లైటు పెట్టుకోకూడదని తెలిసినా సల్వీందర్ సింగ్ తన వాహనానికి ఆ రంగు లైట్ ఏర్పాటు చేశారని అధికారులు గుర్తించారు.

దర్జాగా చెక్ పోస్టులు దాటి వేశారు.

దర్జాగా చెక్ పోస్టులు దాటి వేశారు.

భారత్ సరిహద్దులోకి ఇదే కారులో ఉగ్రవాదులు దర్జాగా ఆయుధాలతో ప్రవేశించారు. నీలి రంగు సైరన్ లైటు వేసుకుని అన్ని చెక్ పోస్టుల దగ్గర ఆపకుండా వెళ్లిపోయారని అధికారులు గుర్తించారు.

నేను బాధితుడినే

నేను బాధితుడినే

ఈ కేసుకు సంబంధించి తనకు ఏ మాత్రం తెలియదని, తాను ఉగ్రవాదుల భాధితుడే అని ఎస్పీ సల్వీందర్ సింగ్ చెబుతున్నారు.

సస్పెండ్ చెయ్యలేదు

సస్పెండ్ చెయ్యలేదు

ఎస్పీ సల్వీందర్ ను తాము ఇంత వరకు సస్పెండ్ చెయ్యలేదని పూర్తి విచారణ చేస్తున్నామని పంజాబ్ డీజీపీ సురేష్ అరోరా అన్నారు.

పొంతన లేని మాటలు

పొంతన లేని మాటలు

సల్వీందర్ సింగ్ రోజుకు ఒక మాట చెబుతున్నారని, ఒకదానికి ఒకటి పొంతనలేకుండా ఉందని అందుకు పాలిగ్రాఫ్ పరిక్షలు నిర్వహించాలని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.

అన్ని విషయాలు ఎస్పీకి తెలుసు

అన్ని విషయాలు ఎస్పీకి తెలుసు

పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత్ లోకి చోరబడిన విషయం, వారు దాడి చెయ్యడానికి వేసిన స్కెచ్ విషయం గురుదాస్ పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్ కు తెలిసి ఉంటుందని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు.

బ్లూ లైట్ కొంప ముంచింది.

బ్లూ లైట్ కొంప ముంచింది.

సల్వీందర్ సింగ్ కారుకు ఏర్పాటు చేసిన బ్లూ లైట్ వాహనంలో కాకుండా వేరే కారు అయితే ఉగ్రవాదులు కచ్చితంగా పట్టుబడేవారు. బ్లూ లైట్ వాహనం కొంప ముంచింది.

ఎస్పీ నోరు విప్పాలి

ఎస్పీ నోరు విప్పాలి

గురుదాస్ పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్ నోరు విప్పితేనే అసలు విషయాలు బయటకు వస్తాయని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు.

ఇప్పటికే విచారణ

ఇప్పటికే విచారణ

సల్వీందర్ సింగ్ మహిళా పోలీసులపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ జరుగుతున్నది.

ఎందుకు అరెస్టు చెయ్యలేదంటే

ఎందుకు అరెస్టు చెయ్యలేదంటే

సల్వీందర్ సింగ్ తో పాటు మరి కొందరిని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరిని ఒకే సారి అరెస్టు చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

ఢిల్లీ లేదా బెంగళూరు

ఢిల్లీ లేదా బెంగళూరు

సల్వీందర్ సింగ్ ను విలైనంత త్వరగా ఢిల్లీ లేదా బెంగళూరు తీసుకు వెళ్లి పాలిగ్రాఫ్ పరిక్షలు నిర్వహించాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారు.

English summary
NIA is planning to take him either to Delhi or to Bangaluru for the test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X