Viral Video: ఇదేం పనిష్మెంట్.. చెవికి పీకలు పెట్టి మరి.. వైరల్ అయిన వీడియో..
సాధారణంగా ఏదైనా ఉత్సవాలు జరిగినా.. జాతరలు జరిగినా అక్కడ యుతు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్య సౌండ్ చేసే పీకలు జాతరలో ఎక్కువగా అమ్ముతున్నారు. ఇవి కొన్న పిల్లలు, యుత వాటిని ఊదుతూ సౌండ్ చేస్తారు. అయితే చాలా ఎక్కువ సౌండ్ చేసి చుట్టు ఉన్నవారిని ఇబ్బంది పెడతారు. ఆ సౌండ్ అక్కడున్న వారు సౌండ్ పోల్యూషన్ తో ఇబ్బంది పడుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్
తాజాగా ఈ పీకలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఇద్దరు యువకులు పీకలు ఊదుతూ సౌండ్ చేస్తూ రాగా.. వారిని చూసిన పోలీసులు ఇద్దరు యువకులను పట్టుకున్నారు. ఒకడి చెవిలో పీక పెట్టి మరొకడిని ఊదించారు. దీంతో వాడి చెవిలో పీక పెట్టి మరొకడు ఊదాడు.

పోలీసులు వారితో కుంజీలు
ఇలా వీడి చెవికి ఒకసారి, వాడి చెవికి ఒకసారి పీక పెట్టి ఊదించారు. మరో పీకలు ఊదుతూ సౌండ్ చేస్తారా అంటూ వారిని బెదిరించారు పోలీసులు. ఆ తర్వాత వారితో కుంజీలు తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎడ్యుకేటర్స్ బీహర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
నెటిజన్లు కామెంట్
ఈ వీడియోను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పోస్ట్ చేయగా.. 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 43 మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ చేశారు. పోలీసులు మంచి పని చేశారని ఒకరు కామెంట్ చేయగా.. ఈ వయస్సులో కాకుంటే వారు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారని మరొకరు కామెంట్ చేశారు. అల్లరి ఎప్పుడు శృతిమించ్చొదని ఇంకొకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications