Toor Dal: రూ.200 లకు చేరువలో కంది పప్పు..
మొన్నటి వరకు సామాన్యులకు టమాటా చుక్కలు చూపించింది. అప్పుడు అల్లం వెల్లుల్లి ధర కూడా భారీగా పెరిగింది. అల్లం వెల్లుల్లికి ఇప్పటికీ ఎక్కువ ధరలే ఉన్నాయి. తాజాగా కంది పప్పు ఆందోళన కలిగిస్తోంది. కిలో కంది పప్పు ధర డబుల్ సెంచరీకి చేరువలో ఉంది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో కంది పప్పు రూ. 150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. నాణ్యతన బట్టి ధర ఉంటుంది. రాబోయే రోజుల్లో కంది పప్పు ధర పెరుగుతుందని వ్యాపారులు, వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కంది సాగు తగ్గడం, ఉత్పత్తి పడిపోవడంతో పప్పు ధర పెరుగుతుందని చెబుతున్నారు. వచ్చే రోజుల్లో కిలో కంది పప్పు రూ. 200 లకు పైనే ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో పేదలు కంది పప్పు కొనలేరు. గతంలో కందిపప్పు ధర పెరిగినప్పుడు రేషన్ షాపుల ద్వారా కంది పప్పును రాయితీతో అందించారు. కానీ ఇప్పుడు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి కంది పప్పును రేషన్ షాపుల ద్వారా రాయితీపై అందించాలని ప్రజలు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా కంది సాగు తగ్గిపోయింది. ఫలితంగా ఉత్పత్తి కూడా పడిపోయింది.

2018లో 43లక్షల టన్నుల ఉత్పత్తి లభించగా.. 2023లో (గతేడాది ఖరీఫ్ పంట) 34లక్షల టన్నులకు తగ్గింది. కంది పప్పు ధరు పెరుగుతోన్నాయి. మరోవైపు కేంద్ర కూడా కంది పప్పు దిగుమతి పెంచడానికి చర్యలు తీసుకుంటోంది. 2018 ఆగస్ట్ లో కిలో రూ.65 ఉన్న కంది పప్పు 2023 ఆగస్ట్ 23 నాటికి రూ.170 లకు పెరిగింది. గత సంవత్సరం ఆగస్ట్ 23న కిలో కంది పంపు రూ.115 పలికింది. అంటే సంవత్సరంలో రూ. 55 పెరిగింది. కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలను అదుపులోకి తెవడానికి ప్రయత్నం చేస్తోంది.
అటు ఉల్లి ధర పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఉల్లి ఎగమమతి పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. అటు బియ్యం ధరలు భారీగా పెరుగుతుండడంతో బాస్మతీయేతర బియ్యం ఎగుమతి కేంద్రం నిషేధం విధించింది. ఉప్పుడు బియ్యం ఎగుమతి పై ఎగుమతి సుంకాన్ని విధించింది. త్వరలో చక్కెర ఎగుమతిపై కూడా ఎగుమతి సుంకం విధించే అవకాశం ఉంది. మరో వైపు కేంద్రం ఈ మధ్యే ఎల్పీజీ సిండర్ల ధరను రూ.200 లకు తగ్గించింది.












Click it and Unblock the Notifications