గ్యాస్ సిలిండర్లపై భారీ ఊరటనిచ్చిన కేంద్రం
Commercial LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్పంగా లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్‌పై రూ. 58.50 పైసల రూపాయల మేర తగ్గింది. ఈ ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. వాటి రేట్లను తగ్గించడం ఈ ఏడాదిలో ఇది అయిదోసారి. జనవరిలో రూ. 14.50 పైసలు, ఫిబ్రవరిలో ఏడు రూపాయలు, ఏప్రిల్ లో 41 రూపాయల మేర వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు తగ్గాయి.

జూన్ 1వ తేదీన కూడా వీటి రేట్లు తగ్గాయి. ఒక్కో సిలిండర్ మీద 24 రూపాయల మేర తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పుడు ఒక్కో సిలిండర్ ధర 58 రూపాయల మేర తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది కాలంలో ఒక్కసారే ఈ సిలిండర్ల రేట్లు పెరిగాయి. మార్చి 1వ తేదీన ఆరు రూపాయల మేర పెంచాయి.
తాజా తగ్గింపుతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు రూ.1,723 నుంచి 1,665 రూపాయలకు తగ్గింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 1,670 నుంచి రూ. 1,616.50 పైసలకు తగ్గింది. కోల్‌కతలో రూ.1,826 నుంచి 1,769 రూపాయల మేర తగ్గింది. చెన్నైలో నిన్నటివరకు రూ. 1,881 ఉన్న కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర.. ప్రస్తుతం నుంచి రూ. 1,822.50 పైసలు పలుకుతోంది.
Oil marketing companies have revised the prices of commercial LPG gas cylinders. The rate of 19 kg commercial LPG gas cylinders has been reduced by Rs 58.50, effective from today. In Delhi, the retail sale price of a 19 kg commercial LPG cylinder is Rs 1665 from July 1. There is…
— ANI (@ANI) June 30, 2025
గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర రూ.855. 50 పైసలు. ఈ ఏడాది ఏప్రిల్ లో వీటి రేట్లను భారీగా పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఒక్కో సిలిండర్ మీద 50 రూపాయలు పెరిగింది. ఉజ్వల పథకం కింద నిరుపేద కుటుంబాలకు అందజేస్తోన్న సిలిండర్లపైనా ఈ వడ్డింపు వర్తించింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications