Tomato, Green Chilli: భారీగా పెరిగిన టమాటా, పచ్చి మిర్చి, అల్లం ధరలు..
టమాటా ధరలు దూసుకెళ్తున్నాయి. గత 10 రోజులుగా టమాటా రూ.100 లకు పైనే పలుకుతుంది. మంగళవారం కోల్ కతాలో కిలో టమాటా అత్యధికంగా రూ.155 లు పలికింది. ఢిల్లీలో టమాటా ధర కిలో రూ.110 ఉండగా.. చెన్నైలో రూ.117 గా ఉంది. ముంబైలో మాత్రం కిలో టమాటా రూ.58 గా ఉంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకారం సగటు కిలో టమాటా ధర రూ.83 లగా ఉంది.
జులై 2న మధ్యప్రదేశ్ లోని రాయ్ సెన్ జిల్లాలో ఆదివారం కిలో టమాటా రేటు రూ.160 పలికింది. ఇతర ప్రాంతాల్లో రూ.110 నుంచి 140 లకు చేరింది. దిగుబడి తగ్గడంతో టమాటాల కొరత ఏర్పడిందని రాయ్ సెన్ జిల్లా పాలనాధికారి అరవింద్ దూబే తెలిపారు. గత గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర రికార్డు ధర పలికింది. కిలో టమాటా రూ.124 లకు పెరిగింది.

తెలంగాణలో కూడా కిలో టమాటా రూ.100 నుంచి రూ.150 లు పలుకుతోంది. టమాటాతో పాటు పచ్చి మిర్చి ధర కూడా భారీగా పెరిగింది. దేశంలోని చాలా ప్రాంతాలలో పచ్చి మిర్చి ధలు భారీగా పెరిగాయి. చెన్నైలో పచ్చి మిర్చి కిలో రూ.100 ఉండగా.. కోల్ కతాలో రూ.350 గా ఉంది. దిగుబడి తగ్గడంతోనే టమాటా, మిర్చి ధరల భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఆంద్రప్రదేశ్‌లోని రైతులు గత పంటలో మిర్చికి మంచి ధర లభించకపోవడంతో ఇతర పంటల సాగు చేశారని.. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. టమాటా, పచ్చి మిర్చితో పాటు అల్లం ధర కూడా భారీగా పెరిగింది. కిలో అల్లం రూ.200 పైగా పలుకుతోంది. భారీగా పెరిగిన కూరగాయల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో పలు రాష్ట్రాలు సబ్సిడీలో టమాటాను అందిస్తోంది. తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో సబ్సిడీలో టమాటా అందిస్తున్నారు.
కూరగాయలతో పాటు కోడి గుడ్డు రేటు కూడా భారీగానే ఉంది. ఒక్కో కోడి గుడ్డు రూ.6 నుంచి రూ.7 పలుకుతోంది. ఈ ధరల పొటు కొద్ది రోజులపాటు తప్పదని వ్యాపారులు, రైతులు చెబుతున్నారు. రెండు నెలల పాటు ఈ ధరల ఇలానే ఉంటాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications