కావేరీ చిచ్చు: గురువారం బంద్, పోలీసులు అలర్ట్
బెంగళూరు: కన్నడ సంఘాల ఒక్కూట (సమైక్య) సెప్టెంబర్ 15వ తేదిన కర్ణాటకలో రైళ్ల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ లో ఒక లక్ష మంది కన్నడిగులు పాల్గోంటారని కన్నడ సంఘాల నాయకులు అంటున్నారు.
ఈ విషయంపై కన్నడ చళవళి వాటళ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు వాటళ్ నాగరాజ్ మాట్లాడారు. సెప్టెంబర్ 15వ తేదీన తాము కర్ణాటక బంద్ కు పిలుపునివ్వలేదని స్పష్టం చేశారు.
అయితే తాము ముందు చెప్పినట్లే కర్ణాటకలో అన్ని రైళ్ల సంచారాన్ని బంద్ చేస్తామని అన్నారు. కావేరీ జలాల పంపిణి, మహాదాయి (గోవా-కర్ణాటక) వివాదంలో ఇచ్చిన తీర్పును ఖండిస్తూ తాము రైళ్ల బంద్ ఉధ్యమం చేస్తున్నామని వివరించారు.

సెప్టెంబర్ 15 (గురువారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైళ్ల సంచారాన్ని పూర్తిగా అడ్డుకుంటామని అన్నారు. కన్నడ సంఘాలు రైళ్ల బంద్ కు పిలుపునివ్వడంతో కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో రైళ్ల సంచారం అస్థవ్యస్తం కానుంది.
కావేరీ జలాలు, మహాదాయి విషయాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లడానికే తాము రైళ్ల బంద్ కు పిలుపునిచ్చామని వాటళ్ నాగరాజ్ స్పష్టం చేశారు. ఈ రైళ్ల బంద్ లో సుమారు ఒక లక్ష మంది పాల్గోంటారని వాటళ్ నాగరాజ్ అన్నారు.
సోమవారం బెంగళూరు నగరంలో ఆందోళనలు చేసిన సమయంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అయితే గురువారం రైళ్ల బంద్ సందర్బంగా ఎలాంటి గొడవలు జరకుండా చూడటానికి పోలీసు అధికారులు సిద్దం అయ్యారు.












Click it and Unblock the Notifications