వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక సీటీ స్కాన్‌... 400 ఎక్స్‌రేలు తీసుకున్నంత ప్రమాదం: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సీటీ స్కాన్ ప్రమాదం

కరోనా రోగులు సీటీ స్కాన్ చేయించుకోవడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెబుతున్నట్లు ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వెంటనే సీటీ స్కాన్‌ తీయించుకోవడం మంచిది కాదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు.

ఒక సీటీ స్కాన్‌ 400 చెస్ట్‌ ఎక్స్‌రేలతో సమానమని, దానివల్ల భవిష్యత్తులో కేన్సర్‌ ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించారు.

కరోనా లక్షణాలు లేనివారు, తేలికపాటి లక్షణాలున్నవారు దాని జోలికి పోవద్దని ఆయన సూచించారని ఈనాడు రాసింది.

ఆయన సోమవారం దిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

అసలు కరోనా లక్షణాలు లేనివారు, తేలికపాటి లక్షణాలు ఉన్నవారు సీటీ తీయించుకుంటే లోపల మరకలు (ప్యాచెస్‌) వస్తాయి. తేలికపాటి లక్షణాలు ఎలాంటి చికిత్స లేకుండానే వాటంతట అవే పోతాయి. ఆక్సిజన్‌ స్థాయి సాధారణంగానే ఉండి, తేలికపాటి లక్షణాలతో ఇంట్లోనే ఏకాంతంలో కొనసాగుతున్నవారు సీటీ చేయించుకోవాల్సిన అవసరమేలేదు.

యువత ఎక్కువ సీటీ స్కాన్‌ చేయించుకుంటే తర్వాతి దశలో కేన్సర్‌ ముప్పు పెరిగే ప్రమాదం ఉంది. మధ్యస్థాయి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరేటప్పుడు మాత్రమే సీటీ స్కాన్‌ చేయించుకోవాలి.

ఏదైనా అనుమానం ఉంటే తొలుత ఛాతీకి ఎక్స్‌రే తీయించుకున్న తర్వాతే సీటీస్కాన్‌కు వెళ్లాలి. బయో మార్కర్స్‌ రక్త పరీక్షల జోలికి కూడా పోవద్దు.

కొందరు ప్రతి మూడురోజులకు ఒకసారి స్కాన్‌ చేయించుకుంటున్నారు. అలాంటి వారికి భవిష్యత్తులో కేన్సర్‌ ముప్పు అధికం.

తేలికపాటి లక్షణాలు ఉన్నవారికి చాలా వరకు ఎలాంటి మందులు అవసరం లేదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఐవర్‌మెక్టిన్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ తీసుకోవచ్చు. అంతకుమించి అవసరం లేదు.

ఆసుపత్రుల్లో కొందరు రోగులు ప్రాథమిక దశల్లోనే స్టిరాయిడ్స్‌ తీసుకుంటున్నారు. అలా చేస్తే వైరస్‌కు బలం చేకూరుతుంది. అధికమందుల వినియోగం (ఓవర్‌ ట్రీట్‌మెంట్‌) వల్ల నష్టం కలుగుతుందని ఆయన చెప్పారని ఈనాడు వివరించింది.

కోవిడ్ చికిత్సకు నాట్కో ఫార్మా మాత్రలు

కరోనా చికిత్సకు హైదరాబాద్‌లోని నాట్కో ఫార్మా ఔషధానికి అత్యవససర అనుమతులు లభించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించడానికి నాట్కో ఫార్మాకు చెందిన బారిసిటినిబ్‌ మాత్రలకు అత్యవసర వినియోగం కోసం అనుమతులు లభించాయి.

కరోనా రోగుల చికిత్సకు రెమ్‌డెసివిర్‌తో కలిపి ఈ ఔషధాన్ని వినియోగిస్తారని నాట్కో ఫార్మా తెలిపింది.

1, 2, 4 ఎంజీ మోతాదు కలిగిన బారిసిటినిబ్‌ మాత్రల అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) పచ్చజెండా ఊపిందని సంస్థ పేర్కొందని పత్రిక చెప్పింది.

ఈ వారంలోనే వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తామని వెల్లడించింది.

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ రోగుల్లో కీళ్ల నొప్పులు, మంటలు, వాపుల చికిత్సకు బారిసిటినిబ్‌ను వినియోగిస్తున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

కోవిడ్ కొత్త స్ట్రెయిన్

ఏపీలో కొత్త స్ట్రెయిన్ లేదు

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కొత్త స్ట్రెయిన్ లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు సాక్షి కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్‌ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

ప్రస్తుతం ఉన్న స్ట్రెయిన్‌ గతేడాది జూలై నుంచే రాష్ట్రంలో ఉందన్నారు. సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కూడా కొత్త స్ట్రెయిన్‌ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు.

ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్‌ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త స్ట్రెయిన్‌ వల్లే కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయనడం సరికాదన్నారు.

కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను పాటిస్తే కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చన్నారని సాక్షి వివరించింది.

కోవిడ్ టీకా

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టీకా

ఇక మీదట టీకా కోసం స్పాట్ రిజిస్ట్రేషన్ ఉండదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి మాత్రమే ఇకపై కొవిడ్‌ వ్యాక్సీన్ ఇవ్వనున్నట్టు తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ జీ శ్రీనివాస్‌రావు ప్రకటించారు.

సోమవారం కోఠిలోని ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన 45 ఏళ్లు దాటినవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతున్నదని స్పష్టంచేశారు.

అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో మొదటి, రెండో డోసులు ఇస్తామన్నారు. మొదటిదైనా, రెండోదైనా వ్యాక్సీన్ వేసుకోవాలనుకుంటున్నవారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఆయన చెప్పారని పత్రిక రాసింది.

కొవిన్‌ పోర్టల్‌ ద్వారా స్లాట్‌బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సీన్ ఇస్తామని, గతంలో జరిగినట్లు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ ఉండబోదని తెలిపారు.

స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో భౌతికదూరం సాధ్యం కావటం లేదని, వైరస్‌ వ్యాప్తికి అవకాశాలు ఉంటున్నాయని అందుకే స్పాట్‌ రిజిస్ట్రేషన్‌కు స్వస్తి చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి యువత సహాయం అందించాలని, చుట్టుపక్కల ఉన్న ఇంటర్‌నెట్‌ సెంటర్ల ద్వారా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు.

రెండు డోసులు తీసుకున్నవారు మాత్రమే కరోనా బారిన పడకుండా 80% కాపాడుకోవడం సాధ్యమవుతుందని వెల్లడించారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The risk of taking a CT scan 400 x-rays: Press Review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X