బెడ్ రూమ్ లో భార్య పక్కలో ఉంటే పీసులు పీసులుగా నరికేశారు, అత్తారింటిలో వేట !
యవ్వనంలో ఉన్న యువకులు హీరోల్లా ఫీల్ అయిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే మూతిమీద మీసాలు రానివాడు కూడా తాను హీరో అని ఫోజులు కొడుతున్నాడు. మూతిమీదకు వచ్చిరాని మీసాలు వచ్చిన వెంటనే రెచ్చిపోయిన యువకుడు రౌడీషీటర్ అయ్యాడు. అర్దరాత్రి భార్య పక్కన నిద్రపోతున్న రౌడీని అదే మంచం మీద నిద్రలోనే నరికి చంపేయడం కలకలం రేపింది.
మద్యం సేవించి అత్తగారింట్లో కడుపునిండా భోజనం చేసి భార్య పక్కలో నిద్రిస్తున్న వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చిన ప్రత్యర్థులు తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి చంపేశారు. ప్రత్యర్థుల దాడిలో బెంగళూరు సిటీలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన రౌడీషీటర్ పేరు సతీష్ అలియాస్ మిలటరీ సతీష్. తండ్రి ఆర్మీలో పని చేస్తుండటంతో సతీష్ కు మిలటరి సతీష్ అని పేరు వచ్చింది.

ఆర్మీ ఆఫీసులో తండ్రి పని చేస్తున్నా సతీష్ మాత్రం ఆ ప్రాంతంలో దాదా మామూళ్లు వసూలు చేస్తూ దందాలు చెయ్యడం మొదలుపెట్టాడు. ఇలా మూతిమీద మీసాలు రాకుండా సతీష్ రౌడీషీటర్ల జాబితాలో పేరు తెచ్చుకున్నాడు. ఏడెనిమిది క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న సతీష్ పేరును రౌడీషీటర్ జాబితాలో చేర్చిన పోలీసులు అతని మీద నిఘా వేశారు. రౌడీగా పేరు తెచ్చుకున్న సతీష్‌ను ప్రత్యర్థులు టార్గెట్ చేశారు.
బెంగళూరులోని వివేకనగర్ సమీపంలోని మాయాబజార్ మురికివాడలో సతీష్ భార్య కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. భర్తకు విడాకులు ఇచ్చి బిడ్డతో కలిసి వేరుగా నివాసం ఉంటున్న మహిళను ప్రేమించిన సతీష్ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. సతీష్ భార్యకు ఆమె మొదటి భర్తతో కాపురం చెయ్యడంతో ఓ బిడ్డ ఉంది. సతీష్ ను పెళ్లి చేసుకున్న తరువాత ఆమె మరోసారి గర్బవతి అయ్యింది. నాలుగు నెలల గర్బవతిగా ఉన్న భార్య వివేక్ నగర్ లోని ఆమె పుట్టింటికి వెళ్లింది.
పుట్టింటిలో ఉన్న భార్యను చూడటానికి గురువారం రాత్రి సతీష్ వివేక్ నగర్ లోని అత్తారింటికి వెళ్లాడు. తనకు ప్రాణహాని ఉందని తెలుసుకున్న సతీష్ నిత్యం కత్తి వెంటపెట్టుకుని ఉండేవాడని తెలిసింది. గురువారం రాత్రి సతీష్ అతని భార్య, అత్తమామలతో కలిసి భోజనం చేసి తరువాత అతని భార్యతో కలిసి బెడ్ రూమ్ లోకి వెళ్లాడు. సతీష్ ఛాతి మీద అతని భార్య మొదటి భర్తకు పుట్టిన బిడ్డకూడా నిద్రిపోతున్నది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సతీష్, అతని భార్య హాయిగా నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు నలుగురు దుండగులు అతని ఇంట్లోకి చొరబడ్డారు.

ఆ సమయంలో బెడ్ మీద నిద్రపోతున్న సతీష్ ను వేటకొడవళ్లతో నరికేశారు. హంతకులు వేటకొడవళ్లతో అతను తప్పించుకోవడానికి అవకాశం లేకుండా బెడ్ రూమ్ లోనే నరికేయడంతో సతీష్ నిద్రలోనే మృతి చెందాడు. సతీష్ మీద నిద్రపోతున్న చిన్నారి చేయి కూడా దుండగులు నరికేశారు. సతీష్ భార్య, ఆమె కుటుంబ సభ్యులను హంతకులు వదిలేసి అక్కడి నుంచి దర్జాగా బయటకు వెళ్లిపోయారు. చెయ్యి తెగిపోవడంతో ఆ చిన్నారికి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పాత కక్షలే సతీష్ హత్యకు కారణమని తెలుస్తోంది. వివేకనగర్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు సతీష్‌కు భర్తతో విడాకులు తీసుకున్న మహిళతో వివాహమైందని, అతనితో కాపురం చెయ్యడంతో ఆమె ప్రస్తతం గర్భవతి అని, భార్యను చూసేందుకు వచ్చిన సతీష్ హత్యకు గురైనాడని పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన వివేకనగర్ పోలీసులు హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే రౌడీషీటర్ సతీష్ హత్యకు గల ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉందని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications