ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి: పద్మావతి సినిమాపై నేతలకు ప్రకాశ్ రాజ్
చెన్నై: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పద్మావతి చిత్రంపై స్పందించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పద్మావతి చిత్రాన్ని ముందు సెన్సార్ బోర్డు చూడాలని సుప్రీం కోర్టు మూడోసారి చెప్పిందని పేర్కొన్నారు.

సెన్సార్ పూర్తయ్యే వరకు ఈ విషయంపై ప్రజా ప్రతినిధులు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయవద్దని తన పోస్టులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications