డెల్ కంపెనీ ఉద్యోగిని హత్య: సీబీఐ చార్జ్ షీట్
బెంగళూరు: డెల్ సంస్థ బీపీవో ఉద్యోగిని హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఎట్టకేలకు బెంగళూరు 17వ ఎసీఎంఎం న్యాయస్థానంలో చార్జీషీట్ సమర్పించారు. జిమ్ శిక్షకుడు జేమ్స్ కుమార్ బీపీవో ఉద్యోగిని పాయల్ సురేఖ (29)ను దారుణంగా హత్య చేశాడని సీబీఐ అధికారులు కోర్టులో చెప్పారు.
పాయల్ సురేఖ తండ్రి దీనదయాళ్ కోర్టులో రెండు అర్జీలు సమర్పించారు. తన కుమార్తె పాయల్ ను సురేఖ, జేమ్స్ కుమార్ కలిసి హత్య చేశారని పిటిషన్ లు వేశారు. అర్జీలు విచారణ చేసిన న్యాయమూర్తులు కేసు దర్యాప్తు చెయ్యాలని సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సీబీఐ అధికారుల దర్యాప్తులో జేమ్స్ కుమార్ ఒక్కడే హంతకుడు అని వెలుగు చూసిందని, సాక్షాలు లభ్యం అయ్యాయని సీబీఐ అధికారులు తెలిపారు. ఇంతకు కేసు నమోదు చేసిన బెంగళూరు నగరంలోని జేపీ నగర పోలీసులు కేసు మూసి వేసి చేతులు దులుపుకున్నారు.

డెల్ కంపెనీలో ఉద్యోగం చేసే అస్సాంకు చెందిన పాయల్ సురేఖ బెంగళూరు నగరంలోని జేపీ నగర 7వ స్టేజ్ లో ని అపార్ట్ మెంట్ లో నివాసం ఉండేది. 2010 డిసెంబర్ 17వ తేదిన ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో దారుణ హత్యకు గురైయ్యింది.
తరువాత పోలీసులు కేసు నమోదు చేసి జేమ్స్ కుమార్ ను అరెస్టు చేశారు. జైలుకు వెళ్లిన జేమ్స్ కుమార్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. తరువాత సరైన సాక్ష్యాధారాలు లేవని కేసు మూసి వేశారు. పాయల్ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించారు.












Click it and Unblock the Notifications