మేనత్తతో అక్రమ సంబంధం, సుకన్యా రెడ్డిని ఎలా చంపేశాడంటే ? బీటెక్ చదివి సినిమా స్టైల్లో !
విజయవాడకు చెందిన సుకన్య రెడ్డి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది . బెంగళూరులోని దొడ్డ తోగూర్‌లో సుకన్యా రెడ్డి కనిపించకుండా పోయింది. పోలీసుల విచారణ అనంతరం సుకన్యా రెడ్డిని దారుణంగా హత్య చేసినట్లు తేలింది. అయితే సుకన్యా రెడ్డిని హత్య చేసింది మరెవరో కాదు. సుకన్యా రెడ్డి భర్త సోదరి కొడుకే హంతకుడు. మేనత్తతో అక్రమ సంబందం పెట్టుకున్న బీటెక్ బాబు చివరికి సుకన్యా రెడ్డిని చంపేశాడు.
విజయవాడకు చెందిన నరసింహారెడ్డి కొన్ని ఏళ్ల క్రితం సుకన్యా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. బెంళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని పోడు గ్రామ సమీపంలో సుకన్యా రెడ్డి మృతదేహం కాలిపోయి కనిపించింది. అనుమానంతో సుకన్యా రెడ్డి భర్త నరసంహా రెడ్డి సోదరి కుమారుడు జస్వంత్ రెడ్డి అలియాస్ జస్వంత్ ను విచారించగా హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిందని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన నరసింహా రెడ్డి, సుకన్యా రెడ్డి దంపతులు. ఆంధ్రా నుంచి వలస వచ్చి బెంగళూరులోని దొడ్డ తొగూర్‌లో స్థిరపడ్డారు. సుకన్యా రెడ్డి భర్త నరసింహా రెడ్డి ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డు కంపెనీలో పనిచేస్తున్నాడు. సుకన్యా రెడ్డి ఇద్దరు పిల్లలను పోషించేది. అప్పుడప్పుడు బెంగళూరుకు వచ్చే నిందితుడు జశ్వంత్ రెడ్డి అతని అత్త సుకన్యా రెడ్డి వద్ద ఉండేవాడు. ఇదే సమయంలో అత్త సుకన్యా రెడ్డితో చనువు పెంచుకున్న జస్వంత్ రెడ్డి తరువాత ఆమెతో అక్రమ సంబందం పెట్టుకున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది.
బీటెక్ చదివిన జస్వంత్ రెడ్డి అతని విలాసాల ఖర్చుల కోసం అత్త సుకన్యా రెడ్డి దగ్గర డబ్బులు తీసుకునేవాడని తెలిసింది. బెంగళూరు ఎక్కువగా వస్తున్న జస్వంత్ రెడ్డి అతని అత్త సుకన్యా రెడ్డితో ఎంజాయ్ చేసిన తరువాత ఖర్చులకు డబ్బులు తీసుకుని మళ్లీ విజయవాడ వెళ్లిపోతున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇటీవల పంటి నొప్పితో బెంగళూరులోని అత్తవారింటికి వచ్చిన నిందితుడు జస్వంత్ తనకు ఖర్చులకు డబ్బులు కావాలని సుకన్యా రెడ్డి మీద ఒత్తిడి చేశాడని తెలిసింది.
తన దగ్గర నువ్వు అడిగినంత డబ్బులు లేవని, తననను ఇబ్బంది పెట్టకూడదని సుకన్యా రెడ్డి చాలాసార్లు ఆమె అల్లుడు ప్రియుడు అయిన జస్వంత్ రెడ్డికి చెప్పిందని తెలిసింది. అయితే బంగారు గొలుసు ఇవ్వాలని, బంగారు లాకెట్ కావాలని, వాటిని కుదవ పెట్టి డబ్బులు తీసుకుంటానని జస్వంత్ అతని అత్త సుకన్యా రెడ్డి మీద ఒత్తిడి చేశాడని తెలిసింది. అయితే బంగారు నగలు ఇవ్వడానికి సుకన్యా రెడ్డి నిరాకరించిందని సమాచారం.

ఫిబ్రవరి 11వ తేదీన అపార్ట్‌మెంట్‌లో నుంచి పనికి వెళ్లిన సుకన్యా రెడ్డి తరువాత కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆ తర్వాత బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ శవమై కనిపించింది. తరువాత హత్యకు గురైన మహిళ సుకన్యా రెడ్డి అని తేలింది. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. నిందితుడు జశ్వంత్ రెడ్డి సాంకేతిక ఆధారాలతో పిలిపించి నాలుగు రోజుల పాటు అతన్ని విచారించగా విజువల్ సినిమా స్టైల్‌లో అత్త సుకన్యా రెడ్డిని అతను హతమార్చిన అసలు నిజం బయటపడింది.
అత్త సుకన్యా రెడ్డితో అక్రమసంబంధం కొనసాగిస్తున్న నిందితుడు జశ్వంత్ రెడ్డి అతని కారు రిపేరీ కోసం కూడా డబ్బులు అడిగాడని, ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె మెడలోని బంగారు గొలుసు అడిగాడని, చివరికి చైన్ లాకెట్ ఇవ్వమని అడిగాడని, కానీ డబ్బుతో పాటు బంగారు నగలు ఇవ్వకపోవడంతో కోపంతో సినిమా స్టైల్ లో సుకన్యా రెడ్డిని హత్య చేసేందుకు జస్వంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశాడని పోలీసు అధికారులు తెలిపారు.
తమిళనాడులోని హోసూరు నుంచి పెట్రోలు కొని తీసుకు వచ్చి సుకన్యా రెడ్డి శవానికి నిప్పంటించి గోవాకు పారిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయాన్ని పోలీసులు బయటకులాగారు.

జశ్వంత్ రెడ్డి అతని అత్త సుకన్యా రెడ్డి పని ముగించుకుని వస్తారని ఎదురు చూశాడు. ప్రియురాలు సుకన్యా రెడ్డితో కలిసి మీ సాయం కావాలి అంటూ కారు ఎక్కించుకున్నాడు. అనంతరం ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని పోడు గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతానికి సుకన్యా రెడ్డిని తీసుకెళ్లి కారులోనే ఆమె గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేశాడు.
తమిళనాడులోని హోసూరు నుంచి పెట్రోల్ కొని తీసుకు వచ్చాడు. సుకన్యా రెడ్డి శవం మీద ఉన్న బంగారు నగలు తీసుకున్న తరువాత ఆమె శవం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి గోవాకు పరారయ్యాడు. ఫిబ్రవరి 14వ తేదీన గోవాలో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్న జస్వంత్ రెడ్డి తరువాత అక్కడే ఎంజాయ్ చేశాడు. అయితే ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు జస్వంత్ రెడ్డి చిక్కిపోయాడు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో బైక్ దొంగతనం కేసులో, బెంగళూరు శివార్లలోని అత్తిబెలెలో బైక్ లు చోరీలు చేసిన కేసుల్లో జస్వంత్ రెడ్డి నిందితుడు అని పోలీసులు తెలిపారు. తన భార్య సుకన్యా రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమెను తన మేనల్లుడు జస్వంత్ రెడ్డి హత్య చేశాడని నిజం తెలుసుకున్న సుకన్యా రెడ్డి భర్త నరసింహారెడ్డి ఆర్తనాదాలు చేస్తున్నాడని బెంగళూరు పోలీసులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications