ఏం తమాషానా, పన్నీర్ సెల్వం గ్రూప్ లో చేరిపోతా: సీఎంకు ఎమ్మెల్యే వార్నింగ్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి అన్నాడీఎంకే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. తాను చెప్పిన మాటలు పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారని, ప్రత్యర్థి వర్గంలోకి వెళ్లిపోతాయని ప్రత్యక్షంగానే హెచ్చరించారు.

కోయంబత్తూరు సమీపంలోని సులూరు శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే కనగరాజ్ చాల కాలం నుంచి కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లోని క్వారీలు మూసివేయాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు. నిరుపయోగంగా ఈ క్వారీలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న క్వారీల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వానికి, అధికారులకు చెప్పారు. అయితే వారు మాత్రం ఆయన మాటలు పట్టించుకోలేదు.

The Sulur MLA Kanagaraj has warned CM of Tamilnadu unless the stone quarry in Coimbatore not closed, he will go to OPS team.

ఈ వివషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కనగరాజ్ ఆదివారం తమిళనాడు సీఎం పళనిసామి ప్రభుత్వంపై మండిపడ్డారు. వెంటనే క్వారీలను మూసివేయకపోతే తాను పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోతానని గట్టిగానే హెచ్చరించారు. తనతో పాటు మరి కొంత మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోతారని శశికళ వర్గానికి ఝలక్ ఇచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Sulur MLA Kanagaraj has warned CM of Tamilnadu unless the stone quarry in Coimbatore not closed, he will go to Tamil Nadu former CM Panneerselvam team.
Please Wait while comments are loading...