వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట: సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి తాను బళ్లారీకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. అర్జీ పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం .

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరో సారి బళ్లారీలో అడుగు పెట్టి సందడి చెయ్యనున్నారు. తనకుమార్తె బ్రహ్మిణి, అల్లుడు రాజీవ్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి బళ్లారికి బయలుదేరారు.

సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి తాను బళ్లారీకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. అర్జీ పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు బళ్లారీలో ఉండటానికి గాలి జనార్దన్ రెడ్డికి అనుమతి ఇచ్చింది.

గాలి ఫ్రెండ్ శ్రీరాములు ప్యాలెస్ (ఇల్లు) ఇదే (ఫోటోలు)

అక్రమ మైనింగ్ వ్యాపారం చేశారనే కేసులో అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లారు. జామీనుపై విడుదల అయిన గాలి జనార్దన్ రెడ్డిని బళ్లారీలో అడుగు పెట్టరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

The Supreme Court allowed former minister Gali Janardhana Reddy to visit Ballari

తన కుమార్తె బ్రహ్మిణి పెళ్లి పనులు చూసుకోవడానికి బళ్లారీ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి కోర్టులో అర్జీ సమర్పించడంతో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. నవంబర్ 1వ తేదిన గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో మొదటి సారి అడుగుపెట్టి 21 రోజులు సన్నిహితులతో గడిపారు.

గాలి పెళ్లి అదుర్స్: కబాలి, ముఠామేస్త్రీ డ్యాన్స్ (ఫోటోలు)

ఇప్పుడు సంక్రాంతి పండగ జరుపుకోవడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బళ్లారి బయలుదేరారు. బళ్లారీలోని వీరేనగౌడ కాలనీలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులతో కలిసి 16వ తేదీ వరకు సంక్రాంతి పండగ సంబరాలు జరుపుకోవడానికి సిద్దం అయ్యారు.

English summary
The Supreme Court on Wednesday allowed former minister G Janardhana Reddy to visit Ballari and celebrate Makara Sankranti with his daughter and son-in-law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X