• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అయోధ్య రాముడిదే! సుప్రీంకోర్ట్ చారిత్రాత్మక తీర్పు! సమీక్ష నిర్వహిస్తామంటున్న ముస్లిం లా బోర్డ్!

|

ఢిల్లీ/హైదరాబాద్ : అయోధ్య రామ జన్మ భూ వివాద తీర్పు పట్ల దేశవ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దేశం యావత్తూ తీర్పు ఏ వర్గానికి అనుకూలంగా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. బాబ్రీ మసీదు ముందు అదే స్ధలంలో దేవాలయం ఉందో లేదో స్పష్టత మాత్రం రాలేదు. భారత పురావస్తు శాఖ ఇచ్చిన ఆధారాల ప్రకారం మాత్రమే అయోధ్యలో వివాదాస్పద భూమి రామజన్మ భూమిగా అత్యున్నత న్యాయ స్ధానం తుది తీర్పునిచ్చింది. కొన్ని సంవత్సరాల తరబడి కొనసాగిన విచారణలో రామజన్మ భూమి స్థానంలో బాబ్రీ మసీదు ఆనవాళ్లు ఉన్నాయనే అంశాన్ని ముస్లిం మత పెద్దలు అత్యున్నత న్యాయస్థానంలో నిరూపించలేకపోయారు.

Ayodhya verdict: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు మినిట్-టూ- మినిట్ అప్‌డేట్స్, హైలైట్స్

తీర్పు పట్ల సమీక్ష నిర్వహిస్తాం.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న ముస్లిం లా బోర్డ్ న్యాయవాది..

తీర్పు పట్ల సమీక్ష నిర్వహిస్తాం.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న ముస్లిం లా బోర్డ్ న్యాయవాది..

దీంతో రామజన్మ భూ వివాదాంశం హిందూవులకు అనుకూలంగా వెలువడినట్టు తెలుస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు పోలీసు యంత్రాగం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. కాగా ఏళ్ల తరబడి బాబ్రీ మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్నప్పటికి ఆ స్ధలం ముస్లిం సంస్థలకు చెందినట్లుగా న్యాయ స్దానంలో నిరూపించుకునే ఆధారాలు సేకరించుకోలేకపోడం శోచనీయంగా భారత ముస్లిం పర్పనల్ లా బోర్డ్ న్యాయవాది జాఫర్యా జిలానీ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు పట్ల సమీక్షా సమావేశం నిర్వహించుకుని భవిశ్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జిలాని తెలిపారు.

ఢిల్లీకి చేరుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌.. అత్యున్నత న్యాయస్ధానం తీర్పుపై ఫోకస్..

ఢిల్లీకి చేరుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌.. అత్యున్నత న్యాయస్ధానం తీర్పుపై ఫోకస్..

దేశంలో అత్యంత ఉత్కంఠ లేపుతున్న అయోధ్య కేసు తుది తీర్పు నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఢిల్లీ చేరుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ఇప్పటికే ప్రజలంతా సహనంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తీర్పు సందర్బంగా జరగబోయే పరిణామాలపై బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపేందుకు ప్రముఖ నేతను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రీం తీర్పు పట్ల ముస్లిం ప్రజల మనోభావాలు దెబ్బతీపకుండా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. చారిత్రక తీర్పు పట్ల హిందువులు అందరూ సహనంతో, సోదరభావంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

అంతిమ తీర్పు.. అంతా అప్రమత్తం అంటున్న ఏపి డీజీపీ..

అంతిమ తీర్పు.. అంతా అప్రమత్తం అంటున్న ఏపి డీజీపీ..

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని, ఎటువంటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించడానికి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. పౌరులకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే పోలీసులకు సమాచారమందించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా పెట్టామని వెల్లడించారు.

అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు.. అన్ని జిల్లాలను అప్రమత్తం చేసిన డిజీపి..

అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు.. అన్ని జిల్లాలను అప్రమత్తం చేసిన డిజీపి..

ఇటు తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితులు అదుపులో ఉంచేందుకు కూడా గట్టి బద్రతా చర్యలు చేపట్టినట్టు తెలంగాణ డిజిపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల ఎస్పీలకు ముందస్తు సమాచారం అందించినట్టు తెలిపారు. అంతే కాకుండా అయోధ్యపై తీర్పు నేపథ్యంలో రైల్వేస్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత పెంచారు. ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సైనికులు, అధికారుల సెలవులను రద్దు చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే విభాగం స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అనుమానితులపై రైల్వే అధికారులు దృష్టి సారిస్తున్నారు.

ఆ తీర్పుతో పేదలకు ఒరిగేదేమీ లేదు.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్ ట్వీట్ ..

ఆ తీర్పుతో పేదలకు ఒరిగేదేమీ లేదు.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్ ట్వీట్ ..

రామ మందిరం, బాబ్రి మసీదు వివాదం వలన పేదలకు ఒరిగేదేమీ లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నేడు సుప్రీంకోర్టులో అయోద్య కేసు తీర్పు ఇవ్వనున్ననేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేధికగా పలు వ్యాఖ్యలు చేశారు. అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా వివేకంగా వ్యఃవహరించి, శాంతి సామరస్య వాతావరణానికి సహకరించాలని కోరారు. ఐతే చారిత్రాత్మక అయోధ్య తుది తీర్పు పట్ల కేటీఆర్ ట్వీట్ ద్వారా అతి సామాన్యంగా స్పందించడం పట్ల చర్చ జరుగుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to the evidence given by the Archaeological Survey of India, the highest judicial position in Ayodhya is a Ramjanma land. Muslim clerics were unable to prove in the apex court that the Babri Masjid was replaced by Ramjanma land in an investigation that lasted for some years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more