విద్యార్థులను పాకిస్థాన్ వెళ్లిపోవాలని చెప్పిన లేడీ టీచర్, కట్ చేస్తే ఏం జరిగిందంటే ?
బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గలోని ఉర్దూ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు తన తరగతిలోని ఇద్దరు ముస్లిం అబ్బాయిలను మీరు పాకిస్థాన్‌కు వెళ్లిపోండి అంటూ ఆదేశించడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. టీచర్ ను ఇప్పుడు బదిలీ చేశారు. శివమొగ్గ నగరంలోని టిప్పునగర్‌లోని ఓ ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది.
ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు క్లాస్‌లో గొడవలు పడ్డారు. పదేపదే గొడవ పడ్డారని ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు వాపోయింది. టీచర్ హెచ్చరించిన తర్వాత కూడా విద్యార్థులు గొడవపడటం కొనసాగించడంతో ఆ టీచర్ ఆగ్రహం చేశారు. మీరు మర్యాదగా పాకిస్థాన్‌కు వెళ్లండి' అంటూ విద్యార్థులను ఆ లేడీ టీచర్ మందలించింది.

ఈవిషయం తెలుసుకున్న జేడీఎస్ మైనారిటీ విభాగం శివమొగ్గ జిల్లా ఇన్ చార్జి నజుల్లా విద్యాశాఖ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయడంతో ఈఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు గొడవపడిన ఘటనపై నజుల్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మార్గనిర్దేశం చేయడానికి బదులుగా ఆ ఉపాధ్యాయురాలు ఇది మీ దేశం కాదు, ఇది హిందూ దేశం, మీరు పాకిస్తాన్‌కు వెళ్లాలని చెప్పారని నజుల్లా ఆరోపించారు.
మీరు ఎల్లప్పుడూ మాకు బానిసలుగా ఉంటారు, మీరు ఇక్కడ ఉండకూడదు అని ఆ లేడీ టీచర్ ద్వంద్వ వ్యాఖ్యలు చేశారని నజుల్లా ఆరోపించారు. ఈ ఘటనపై విద్యాశాఖా అధికారులకు సమాచారం అందించి ఉపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేశారు. ఉన్నతాధికారులు వెంటనే ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేయాలని విద్యార్థుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ప్రకారం పాకిస్తాన్‌కు వెళ్లండి, ఇది హిందూ దేశం" అని ఉపాధ్యాయురాలు చెప్పినట్లు తెలిసింది. విద్యాశాఖా అధికారి బి.నాగరాజు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను పాకిస్తాన్ కు వెళ్లమని చెప్పింది కన్నడ భాషా పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలని, గత 26 ఏళ్లుగా రెగ్యులర్ ఉద్యోగినిగా ఉంటూ ఎనిమిదేళ్లుగా ఇదే పాఠశాలలో కన్నడ పాఠాలు చెబుతున్నారని తెలిపారు.
ఉపాధ్యాయురాలిని వేరే పాఠశాలకు బదిలీ చేశామని, ఈ విషయమై తదుపరి శాఖాపరమైన విచారణ జరుపుతామని తెలిపారు. విచారణ నివేదిక అనంతరం ఉపాధ్యాయురాలిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖా అధికారి నాగరాజ్ మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications