ఆ ఎన్నికల్లో మమతాబెనర్జీ పార్టీకే చుక్కలు చూపిన మూడునెలల హమ్రో పార్టీ.. ఏం జరుగుతోంది?

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ మునిసిపాలిటీకి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఊహించని విధంగా మూడు నెలల క్రితం వచ్చిన హమ్రో పార్టీ విజయం సాధించడంతో మమతా బెనర్జీ షాక్ తగిలినట్టైంది. బుధవారం ఉత్తర బెంగాల్ కొండలలో మమతా బెనర్జీ ప్రతికూల పవనాలు వీచాయి.

Recommended Video

    UP Elections 2022: Akhilesh Yadav కోసం Mamata Banerjee | BJP Manifesto | Oneindia Telugu

     డార్జిలింగ్ మునిసిపల్ ఎన్నికల్లో హమ్రో విజయం.. మమతకు షాక్

    డార్జిలింగ్ మునిసిపల్ ఎన్నికల్లో హమ్రో విజయం.. మమతకు షాక్


    కేవలం మూడు నెలల క్రితం, గత ఏడాది నవంబర్ 25న స్థాపించబడిన హామ్రో పార్టీ బుధవారం డార్జిలింగ్ మునిసిపాలిటీలోని 32 సీట్లలో 18 స్థానాలను గెలుచుకుంది. ,మెజార్టీ స్థానాలని దక్కించుకుని టీఎంసీకి షాక్ ఇచ్చింది. డార్జిలింగ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనదైన ముద్ర వేయలేకపోయిన పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ కి, పశ్చిమబెంగాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP)తో సహా దాని రాజకీయ ప్రత్యర్థులకు హమ్రో పార్టీ విజయం ఊహించని దెబ్బ గా చెప్పొచ్చు.

     హమ్రో పార్టీ సామాన్య అభ్యర్థులఆసక్తికర సమ్మేళనం

    హమ్రో పార్టీ సామాన్య అభ్యర్థులఆసక్తికర సమ్మేళనం


    హామ్రో పార్టీ డార్జిలింగ్‌లోని మొత్తం 32 వార్డులలో 19 మంది మహిళలు పోటీ చేశారు. ఉపాధ్యాయులు, కార్యకర్తలు, టూర్ గైడ్‌లు, ఒంటరి తల్లులు, ఒక ట్యాక్సీ డ్రైవర్, కొంతమంది నిరుద్యోగ స్థానిక నివాసితులతో సహా అభ్యర్థుల ఎంపిక ఆసక్తికర సమ్మేళనంగా చేసింది. ఇది గూర్ఖా జనముక్తి మోర్చా (GJM) నుండి స్థానిక సంస్థపై నియంత్రణను చేజిక్కించుకుంది. ఇది గూర్ఖా జనముక్తి మోర్చా యొక్క బిమల్ గురుంగ్ మరియు భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా (BGPM) యొక్క అనిత్ థాపా వంటి పెద్ద నాయకులను ఓడించింది. అయితే, హమ్రో పార్టీ అధినేత అజోయ్ ఎడ్వర్డ్స్ స్వయంగా 22వ వార్డు నుంచి ఓడిపోయారు.

    విద్య, పర్యాటకం, ఉపాధిపై ప్రధానంగా ఫోకస్ చేసిన హమ్రో పార్టీ

    విద్య, పర్యాటకం, ఉపాధిపై ప్రధానంగా ఫోకస్ చేసిన హమ్రో పార్టీ


    మూడు నెలల క్రితం హమ్రో పార్టీని ప్రారంభించేందుకు గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జిఎన్‌ఎల్‌ఎఫ్)ని విడిచిపెట్టిన అజోయ్ ఎడ్వర్డ్స్ నిర్లక్ష్యం చేయబడిన పౌరుల ఆరోగ్యం, విద్య మరియు అభ్యున్నతిపై దృష్టి సారించి ప్రజా నాయకుడిగా నిలిచారు. ఆయన పరోపకారి, అతను డార్జిలింగ్‌లోని తన స్వంత రెస్టారెంట్ గ్లెనరీని అలాగే ఎడ్వర్డ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. హామ్రో పార్టీ యొక్క మ్యానిఫెస్టో విద్యపై విస్తృతంగా దృష్టి సారించింది. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల నుండి పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్‌ల వరకు , అలాగే పర్యాటకం ఉపాధిని మాత్రమే కాకుండా, పర్యాటకుల కోసం రాత్రి మార్కెట్‌లు మరియు వారాంతపు ఫ్లీ మార్కెట్‌లను ప్రోత్సహించడానికి కూడా ఉపయోగపడుతుందని పేర్కొంది.

    నిశ్శబ్ద మెజారిటీతో డార్జిలింగ్ పై పట్టు సాధించిన హమ్రో

    నిశ్శబ్ద మెజారిటీతో డార్జిలింగ్ పై పట్టు సాధించిన హమ్రో

    హమ్రో పార్టీ నిలబెట్టిన 32 మంది అభ్యర్థుల్లో 19 మంది మహిళలు. నిశ్శబ్ద మెజారిటీ గొంతుకగా నిలుస్తామని హామీ ఇచ్చిన పార్టీ ప్రజల ఆదరణ పొందింది. ఉత్తర బెంగాల్ కొండలలో తదుపరి జరగనున్న GTA ఎన్నికలపై హమ్రో పార్టీ ప్రభావం ఉండనుంది. పౌర సంస్థల ఎన్నికలకు ముందు, హమ్రో పార్టీ ఎన్నికల తర్వాత ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని చెప్పింది. పార్టీ, స్థానిక సంస్థను నడపడానికి మహిళను ఎన్నుకునే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+