బెంగళూరు బాంబు పేలుడు: నల్లొండ ఎన్‌కౌంటర్ లింక్?
బెంగళూరు: బెంగళూరులోని చర్చిస్ట్రీట్ బాంబు పేలుడు కేసులో నిందితులు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు. ఈ బాంబు పేలుడు కేసులో నిందితులు ఎన్ కౌంటర్ లో మరణించడంతో కేసు దర్యాప్తు కుంటుపడుతున్నదని అంటున్నారు.
2014 డిసెంబర్ 28వ తేదీన బెంగళూరులోని చర్చి స్ట్రీట్ లో బాంబు పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో చెన్నయ్ కి చెందిన భవాని (38) అనే మహిళ మరణించగా ముగ్గురు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జైలు నుండి 2013లో తప్పించుకున్న సిమి ఉగ్రవాదులు చర్చిస్ట్రీట్ లో బాంబు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
జైలు నుండి తప్పించుకున్న వారి కోసం బెంగళూరు పోలీసులు పలు చోట్ల గాలించారు. జైలు నుండి తప్పించుకున్న వారు ఉపయోగించిన మొబైల్ చివరి కాల్ కర్ణాటకలో సిగ్నల్స్ అందాయని పోలీసు అధికారులు అంటున్నారు. జైలు నుండి తప్పించుకున్న వారి కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలలో బెంగళూరు పోలీసులు గాలించారు.

చివరికి ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో తెలంగాణలోని నల్గొండ జిల్లా సీతారంపుర దగ్గర జైలు నుండి తప్పించుకున్న ఇజాజుద్దిన్, అస్లాం ఎన్ కౌంటర్ లో అంతం అయ్యారని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు. బీహార్ జైలులో ఉన్నఇద్దరు సిమి ఉగ్రవాదులను బాడి వారెంట్ మీద బెంగళూరు తీసుకు వచ్చారు.
వారిద్దరిని విచారించినా ఫలితం లేదని పోలీసులు అంటున్నారు. చర్చి స్ట్రీట్ బాంబు పేలుడు కేసు ఎన్ఐఏ అధికారులకు అప్పగించినా బెంగళూరు పోలీసులు మాత్రం పట్టువిడవని విక్రమార్కుల లాగా వారి ప్రయత్నాలు వారు చేస్తునే ఉన్నారు.












Click it and Unblock the Notifications