పహల్గాం ఉగ్రదాడి -1990 నాటి కశ్మీరి పండిట్‌ల ఊచకోతకు ప్రతిబింబమా..?
2025, ఏప్రిల్ 22. ఆ రోజు పహల్గాంలో జరిగింది కేవలం ఒక ఉగ్రదాడి కాదు. అది భారతదేశపు ఆత్మపై జరిగిన క్రూరమైన జిహాదీ దాడి. 26 మంది నిరాయుధులు, అమాయకులు - ఎక్కువగా దేశం నలుమూలల నుండి వచ్చిన పర్యాటకులు - లష్కరే తోయిబా తొత్తుగా మారిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ముష్కరుల తుపాకీ గుళ్లకు బలయ్యారు. వారికి డబ్బు వద్దు, డిమాండ్లు లేవు. కేవలం చంపడం ఒక్కటే వారి లక్ష్యం. గుండెల్లో విషం నింపుకుని, 1990లో కశ్మీరీ పండితులను వెళ్లగొట్టినప్పుడు వినిపించిన అవే మతతత్వ నినాదాలు చేస్తూ, రక్తదాహంతో ఊగిపోయారు. ఇది కేవలం మనుషులపై దాడి కాదు.. భారతదేశం అనే భావనపై, ఇక్కడి ఐక్యతపై జరిగిన హేయమైన దాడి.
మూడు దశాబ్దాల కిందటి ఆ గాయం..
పహల్గాం దుర్ఘటన 30 ఏళ్ల కిందట జరిగిన కశ్మీరీ పండితుల ఊచకోత, బలవంతపు వలసనాటి భయానక దృశ్యాలను కళ్లముందు నిలిపింది.అప్పుడు కూడా అంతే.. ఆలయాలు ధ్వంసం చేశారు, ఇళ్లకు నిప్పు పెట్టారు, మైకుల ద్వారా "మతం మారండి, పారిపోండి, లేదంటే చావండి" అంటూ మరణహోమ నినాదాలు వినిపించారు. లక్షన్నరకు పైగా ఉన్న కశ్మీరీ పండితుల్లో దాదాపు లక్ష మంది 1990 మధ్యనాటికే సర్వం వదిలి శరణార్థులుగా మారారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. నేడు మళ్లీ.. కేవలం భారతీయులైనందుకే, భారతదేశ ఐక్యతకు ప్రతీకగా ఉన్నందుకే పర్యాటకులను చంపేస్తున్నారు. అసలు ఏమైనా మారిందా?

ఒక్కటే మారింది..ఉగ్రవాదం ముందు మోకరిల్లని,ధైర్యంగా నిలబడే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనే ఆర్టికల్ 370 రద్దు సాధ్యమైంది.ఇది వేర్పాటువాద శక్తుల వెన్ను విరిచిన దెబ్బ.కానీ,పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న జిహాదీ గ్రూపులు శాంతి దిశగా అడుగులేస్తున్న లోయను చూసి తట్టుకోలేకపోతున్నాయి.వారి చేతకానితనం,నిరాశతో పన్నిన కుట్రే ఈ పహల్గాం దాడి.ఇక్కడ శాంతి,సౌభ్రాతృత్వం నెలకొనడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు.
బంగ్లాదేశ్,పాకిస్తాన్‌లో హిందువుల దుస్థితి..
పహల్గాంలో మనం చూస్తున్నది భారతదేశానికే పరిమితం కాదు. ఈ విష వలయం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. కశ్మీర్ లోయలో అయినా,బంగ్లాదేశ్‌లో అయినా,పాకిస్తాన్‌లో అయినా హిందువులే తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు.రాడికల్ జిహాదీ భావజాలంలో బహుళత్వానికి,సహనానికి,ప్రజాస్వామ్యానికి తావు లేదు.బంగ్లాదేశ్‌ను గమనిస్తే...1951లో 22% ఉన్న హిందువుల జనాభా నేడు 8% కంటే తక్కువకు పడిపోయింది.కేవలం 2024లో ఒక్కటే హిందువులను లక్ష్యంగా చేసుకుని 76 దాడులు జరిగాయి.గుడులు కూల్చేశారు,ఇళ్లకు నిప్పు పెట్టారు,ఆడవారిపై అఘాయిత్యాలు జరిగాయి.
పాకిస్తాన్‌లో పరిస్థితి మరింత దారుణం.మత దూషణ చట్టాలను ఆయుధాలుగా మార్చి హిందువులను వేధిస్తున్నారు.ఆలయాలను నేలమట్టం చేస్తున్నారు.మైనర్ హిందూ బాలికలను ఎత్తుకెళ్లి బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారు.2024 మొదటి పది నెలల్లోనే వందకు పైగా సంఘటనలు నమోదయ్యాయి.ఇన్నీ జరుగుతున్నా ప్రపంచం మాత్రం గుడ్డిదిగా మారింది.ప్రపంచంలోని ఏ మైనారిటీకి అన్యాయం జరిగినా గగ్గోలు పెట్టే లిబరల్స్ కు హిందువుల బాధ కనిపించడం లేదనే అభిప్రాయం నెలకొంది.హిందువుల కన్నీళ్లు వారికి ఎందుకు పట్టడం లేదు? వారి బాధ ప్రపంచ మనస్సాక్షికి ఎందుకు అంత అసౌకర్యంగా ఉందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
శతృవు వెన్నులో వణుకు పుట్టించిన మోదీ సర్కార్
నీచ రాజకీయాలను వదిలి,దేశ ప్రయోజనాలే ముఖ్యమని ముందుకు సాగుతోంది మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం. ఆర్టికల్ 370 రద్దుతో పాటు, శత్రువు వెన్నులో వణుకు పుట్టించే సర్జికల్ స్ట్రైక్స్, కశ్మీరీ పండితులను తిరిగి వారి స్వదేశంలో స్థిరపరచాలనే నిబద్ధత - ఇవన్నీ ప్రధాని మోడీ ప్రభుత్వం కేవలం సంతాపం తెలపడమే కాదు.. ఆచరణలో చేసి చూపించింది అనడానికి నిదర్శనం.
ఇతర పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ,ఇస్లామిక్ తీవ్రవాదం ముందు మోకరిల్లుతుంటే..బీజేపీ మాత్రమే ఉగ్రవాదం మరియు సామాన్యుల మధ్య బలమైన కవచంలా నిలబడిందని కమలనాథులు గుర్తు చేస్తున్నారు.పహల్గాంలో చిందిన ఆ రక్తం.. దేశానికి బలమైన,జాతీయవాద నాయకత్వం ఎందుకు తప్పనిసరి అనేదానికి కనువిప్పు కలగాల్సిన వాస్తవమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications