Fact Check: కొవిడ్ -19 XXB వేరియంట్ ప్రమాదకరమా..! కేంద్ర ఆరోగ్య శాఖ ఏం చెప్పిందంటే..!
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. డ్రాగన్ దేశంలో జీరో కొవిడ్ పాలసీ ఎత్తేశాక కేసులు భారీగా పెరుగుతోన్నాయి. చైనాలో బీఎఫ్7 వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. చైనాలో కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. చైనాకు సంబంధించి కొన్ని వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బీఎఫ్7 వేరియంట్
కాగా.. చైనాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలను అలర్ట్ చేయడంతో పాటు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటికే బీఎఫ్7 వేరియంట్ కేసులు దేశంలో రెండు నమోదు అయ్యాయి. గుజరాత్ లో ఎన్ఆర్ఐ మహిళలో బీఎఫ్7 వేరియంట్ గుర్తించగా.. ఒడిశాలో కూడా ఓ వ్యక్తిలో బీఎఫ్7 వేరియంట్ గుర్తించారు.

ఐదు రెట్లు ప్రమాదకరం
కరోనా వార్తలు భయం కలిగిస్తున్న వేళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా సాగుతోంది. ఓమిక్రాన్ కొత్తగా వేరియంట్ XBB.. సబ్‌వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే ఐదు రెట్లు ప్రమాదకరమని వాట్సాప్ ల్లో ఓ సందేశం వైరల్ అవుతుంది. ఈ సందేశాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ సందేశం ఫేక్ అని స్పష్టం చేసింది.

9 XXB వేరియంట్
"కోవిడ్ -19 XXB వేరియంట్‌కు సంబంధించి అనేక వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం నకిలీది. ఇది తప్పుదారి పట్టించేది" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఈ సందేశంలో "COVID-Omicron XBB కరోనావైరస్ కొత్త వేరియంట్ భిన్నంగా ఉంది, ప్రాణాంతకం, సరిగ్గా గుర్తించడం సులభం కాదు. కొత్త వైరస్ కోవిడ్-ఒమిక్రాన్ XBB లక్షణాలు - దగ్గు, మరియు జ్వరం లేదు" అని ఉంది. ఇది పూర్తిగా ఫేక్ అని కేంద్ర ఆర్యో శాఖ తేల్చిచెప్పింది.

మన్సుఖ్ మాండవియా
భారత్ లో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పలు దేశాల్లో కేసుల పెరుగుతుందన్నందున నిఘా, నియంత్రణ, నిర్వహణ కోసం ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధతను సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె. పాల్, ఇతర సీనియర్ అధికారులు.












Click it and Unblock the Notifications