Mahakumbh Mela 2025: భక్తులకు అరుదైన అవకాశం - అద్భుత దృశ్యం..!!
Mahakymbh Mela 2025: మహాకుంభమేళా కు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు 11 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే వారం ప్రధాని మోదీ ప్రయాగ్ రాజ్ రానున్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. యూపీ తన మంత్రివర్గ సహచరులతో పుణ్య స్నానాలు చేసారు. కుంభమేళా కు వస్తున్న భక్తులకు అరుదైన అవకాశం కల్పిస్తూ యూపీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
మహాకుంభమేళా ప్రపంచం లోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంగమంగా నిలుస్తోంది. ఈ సమయంలో యూపీ ప్రభుత్వం జనవరి 24 నుంచి 26 వరకూ మహాకుంభమేళాలో డ్రోన్ షో నిర్వహించాలని ఉత్తర ప్రదేశ్ టూరిజం డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి మహాకుంభ్ నగర్ లో రిహార్సల్ నిర్వహించారు. ఈ షో భక్తులకు సంతోషాన్ని ఇచ్చింది. ఒకే సారి వేల సంఖ్యలో డ్రోన్లు ఆకాశంలో మిరుమిట్లు కొలుపుతూ పలు ఆకారాల్లో కనువిందు చేసాయి. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత వెల్లువిరిసేలా ఈ షో నిర్వహిస్తున్నారు. హిందూ దేవతలు.. కుంభమేళా ఆకృతులను డ్రోన్ షోలో అధికారులు ప్రదర్శించారు.

డ్రోన్ షో ప్రదర్శన సమయంలో విద్యుత్ కాంతులు.. ఆకట్టుకునే సంగీతం మరింత అదనపు ఆకర్షణగా నిలిచాయి. లక్షలాది మంది భక్తులు ఈ షో వీక్షించారు. మూడు రోజుల పాటు ఈ షో కొనసాగనుంది. విదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో కుంభమేళాలో పాల్గొంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ నుంచి వచ్చిన సాధువులు మహాకుంభమేళాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంప్రదాయ వస్త్ర ధారణతో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. విదేశీయులు సైతం భారతీయ సంప్రదాయాలకు విలువ ఇస్తూ కుంభమేళాలో పాల్గొంటున్నారు. ఇక.. మూడు రోజుల పాటు సాగే ఈ డ్రోన్ షో కుంభమేళా భక్తులకు అరుదైన అవకాశంగా యూపీ ప్రభుత్వం పేర్కొంది.












Click it and Unblock the Notifications