నా భర్తకు పాము కాటు కాదు, అదే జరిగింది, మీరు చూడండి, కేజీఎఫ్ లో ఏం జరిగిందంటే !
బెంగళూరు/కోలారు: వివాహం చేసుకున్న దంపతులు (wife) సంతోషంగా కాపురం చేస్తున్నారు. తెలిసిన వాళ్ల పొలం లీజుకు తీసుకున్న భర్త (husband) అందులో వ్యవసాయం చేయిస్తున్నారు. ప్రతిరోజు పొలం దగ్గరకు వెలుతున్న భర్త పని పూర్తి చేసుకుని తరువాత ఇంటికి వెలుతున్నాడు. భార్యకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి నీ భర్తకు పాము (snake) కరిచిందని చెప్పాడు. అయితే అక్కడే అసలు కథ మొదలైయ్యింది.
కర్ణాటకలోని కోలారు జిల్లాలోని కేజీఎఫ్ (kgf)తాలుకాలోని హల్కూరు గ్రామంలో చక్రేశ్వర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన అనితా అనే యువతిని చక్రేశ్వర్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత చక్రేశ్వర్, అనితా దంపతులు (wife) చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు.

చక్రేశ్వర నివాసం ఉంటున్న హల్కూరు గ్రామంలోనే నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమిని లీజుకు తీసుకున్న చక్రేశ్వర్ అందులో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చక్రేశ్వర్ భార్య (wife)అనితా ఇంటి దగ్గరే ఉంటున్నది. ప్రతిరోజు ఉదయం పొలం దగ్గరకు వెలుతున్న చక్రేశ్వర్ అక్కడ పని ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నాడు.
ఎప్పటిలాగే చక్రేశ్వర్ ఉదయం ఇంటి నుంచి బయలుదేరి పొలం దగ్గరకు వెళ్లాడు. సాయంత్రం ఓ వ్యక్తి అనితాకు (wife) ఫోన్ చేశాడు. నీ భర్త చక్రేశ్వర్ కోటిలింగేశ్వర దేవస్థానం సమీపంలో వెలుతున్న సమయంలో అక్కడ పాము కాటు వేసిందని, కేజీఎఫ్ (kgf) ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుంటే మార్గం మధ్యలో అతను చనిపోయాడని ఫోన్ చేసి చెప్పాడు.
అయితే తన భర్త చక్రేశ్వర్ చావు మీద తనకు అనుమానం ఉందని, నా భర్త (husband) పాము కాటుతో చనిపోలేదని, ఆయన్ను చంపేసి ప్రమాదవశాత్తు పాము కరించింది అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని, కేసు నమోదు చేసి నిజానిజాలు బయటకు లాగాలని చక్రేశ్వర్ భార్య (wife) అనితా కేజీఎఫ్ లోని బెమెల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. చక్రేశ్వర్ భార్య అనితా ఫిర్యాదు మేరకు అనుమానాస్పదంగా చనిపోయాడని కేసు నమోదు చేసిన కేజీఎఫ్ పోలీసులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications