Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రియుడి మోజులో భార్య, అర్దరాత్రి పొలిటికల్ లీడర్ ఫినిష్, స్నేహా నిద్రమాత్రల స్కెచ్ తో !

వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులు సంతోషంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు మురిసిపోయారు. వ్యాపారం, వ్యవసాయం చేస్తున్న భర్త రాజకీయాల్లో ఉన్నాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన భర్త ఆ పరిసర ప్రాంతాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అక్రమ సంబంధం కారణంగా అర్దరాత్రి ఆ పొలిటికల్ లీడర్ ఫినిష్ అయ్యాడు.

పొలిటికల్ లీడర్ ని ఎందుకు హత్య చేశారు ?, ఎవరు హత్య చేశారు ? అని సమాచారం తెలుసుకున్న బంధువులు, పోలీసులు హడలిపోయారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని రాయచూరు తాలుకాలోని సింగనోడి తాండాలో రాజు నాయక్ అలియాస్ రాజు (34) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన బంధువుల అమ్మాయి స్నేహా (30) అనే యువతిని రాజు వివాహం చేసుకున్నాడు.

The wife who killed the political leader along with her boyfriend due to illicit relationship in Karnataka

సమీప బంధువు అయిన స్నేహాను వివాహం చేసుకున్న తరువాత రాజు ఆమెతో సంతోషంగా కాపురం చేశాడు. భర్త రాజుతో అతని భార్య స్నేహా చాలా సంతోషంగా ఉండేదని తెలిసింది. వ్యాపారం చేస్తున్న రాజు అతని సొంత పొలంలో కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్నాడు. ప్రముఖ పార్టీలో చురుకుగా ఉంటున్న రాజు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చాడు.

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసిన రాజు గ్రామ పంచాయితీ సభ్యుడిగా విజయం సాదించాడు. రాజకీయాల్లో, వ్యాపారంలో రాజు బిజీగా ఉంటున్నాడు. ఇటీవల లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సొంత పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని రాజు ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. రాజుకు ప్రతిరోజు రాత్రి పూట మద్యం సేవించే అలవాటు ఉంది.

The wife who killed the political leader along with her boyfriend due to illicit relationship in Karnataka

రాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకున్న రాజు ఫ్రెండ్స్ తో కలిసి మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. అర్దరాత్రి దాటిన తరువాత తన భర్త రాజు విపరీతంగా మద్యం సేవించి నిద్రలోనే చనిపోయాడని రాజు భార్య స్నేహా ఆమె బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి మద్యం సేవించిన రాజు ఎక్కువ మద్యం సేవించడం వలనే చనిపోయి ఉంటాడని బంధువులు అనుకున్నారు.

రాజు గొంతు మీద కొన్ని గుర్తులు ఉండటంతో అతని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. రాజు శవాన్ని పోస్టుమార్టం కోసం రాయచూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజు తాగిన మద్యంలో నిద్రమాత్రలు కలిపారని, తరువాత అతని గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది.

పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. ఆ సమయంలో రాజు భార్య స్నేహా అక్రమ సంబందం మ్యాటర్ బయటకు వచ్చింది. ప్రియుడు రమేష్ బాబును సెట్ చేసుకున్న స్నేహా అతనితో ఎంజాయ్ చేస్తోందని, ఈ విషయం తెలుసుకున్న రాజు అతని భార్యతో చాలా సార్లు గొడవపడ్డాడని వెలుగు చూసింది. పద్దతి మార్చుకోకపోతే నిన్ను చంపేస్తానని ఇటీవల రాజు అతని భార్య స్నేహాకు వార్నింగ్ ఇచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

The wife who killed the political leader along with her boyfriend due to illicit relationship in Karnataka

తన భర్త బతికి ఉంటే తన ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడం సాధ్యం కాదని తెలుసుకున్న స్నేహా భర్త హత్యకు ప్లాన్ వేసిందని పోలీసులు అన్నారు. రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్త రాజుకు మరో క్వాటర్ బాటిల్ ఇచ్చిన స్నేహ తరువాత చికెన్ వండిపెట్టిందని పోలీసులు అన్నారు. అప్పటికే మద్యంలో నిద్రమాత్రలు కలపడంతో ఆ మందు సేవించిన రాజు నిద్రలోకి జారుకున్నాడని, తరువాత ప్రియుడు రమేష్ ను ఇంటికి పిలిపించిన స్నేహా ఇద్దరూ కలిసి రాజు గొంతు నులిమి హత్య చేశారని పోలీసులు చెప్పారు.

అక్రమ సంబంధం కారణంగా భర్త రాజును హత్య చేసిన స్నేహాను రాయచూరు పోలీసులు అరెస్టు చేరు. పరారైన స్నేహా ప్రియుడి కోసం గాలిస్తున్నామని రాయచూరు గ్రామీణ పోలీసులు తెలిపారు. భార్య అక్రమ సంబంధం కారణంగా ఆమె చేతిలోనే పొలిటికల్ లీడర్ రాజు హత్యకు గురికావడం రాయచూరులో కలకలం రేపింది. ప్రియుడి మోజులో పడి భర్త రాజును చంపిని స్నేహా ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+