Lady: పాస్టర్ ముసుగులో నా జీవితం నాశనం చేశాడు. అసలు ఏం చేశాడంటే ?, కలెక్టర్ కు ఫిర్యాదు చేసి !
చెన్నై/మధురై: ఎవరికైనా సమస్యలు, కష్టాలు బాధలు ఉంటే ఎంతటివారైనా, సామన్య ప్రజలు అయినా గుడికి, మసీదులకు. చర్చిలకు వెలుతుంటారు. భక్తుల సమస్యలు పరిష్కారం కావాలని పూజారులు, మత భోదకులు ప్రార్థనలు చేస్తుంటారు. అయితే అందమైన మహిళ మీద ఓ మతభోదకుడు కన్ను వేశాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని స్కెచ్ వేశాడు. అప్పుడప్పుడు వచ్చి వెలుతున్న మహిళకు వల వేశాడు. అసలే మత భోదకుడు, పైగా శాపనార్తాలు పెడుతాడని భయపడిన ఆ మహిళ అతనికి దగ్గర అయ్యింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మతభోదకుడు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడని తెలిసింది. చివరికి మహిళతో రొమాన్స్ చేస్తున్న సమయంలో సీక్రేట్ గా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. వీడు పాస్టర్ కాదు అందరిని పాడుచేస్తున్న కిరాతకుడు అని బాధితురాలు ఏకంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చెయ్యడం కలకలం రేపింది.

కలెక్టర్ ను కలిసి బాధితురాలు
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలెక్టర్ ను కలిసి ఓ మహిళ చర్చి ఫాదర్ ను కలవడం కలకలం రేపింది. నేను మధురైకి చెందిన మహిళ ప్రస్తుతం తిరునల్వేలి జిల్లా (నెల్లై)లో ఉంటున్నానని వివరించింది. నేను తిరునల్వేలి జిల్లాలోని ఎయిర్‌వాడీ ప్రాంతానికి చెందిన క్రైస్తవ మత బోధకుడు శామ్యూల్‌తో పది సంవత్సరాలుగా స్నేహంగా, చనువుగా ఉంటున్నానని వివరించింది. ఇద్దరి మధ్య చాలా సంవత్సరాల నుంచి స్నేహం ఉందని బాధితురాలు వివరించింది.

పెళ్లి చేసుకుంటానని ?
నన్ను పెళ్లి చేసుకుంటానని పాస్టర్ శ్యామ్యూల్ తనకు చాలాసార్లు చెప్పాడని, పెళ్లికి ముందే తనతో నువ్వు సొంత భార్యలా జీవించాలని ఒత్తిడి చేశాడని బాధితురాలు కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో వివరించింది. తరువాత ఇన్ని సంవత్సరాలు తనతో శారీరక సంబంధం పెట్టుకున్న శ్యామ్యూల్ తనను పెళ్లి చేసుకుంటానని పదేపదే నమ్మిస్తూ వస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది.

చెన్నై యువతితో పెళ్లి ?
నాకు తెలియకుండానే పాస్టర్ శ్యామ్యూల్ చెన్నైలో నివాసం ఉంటున్న ప్లిసీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని బాధితురాలు శ్యామ్యూయల్ మీద ఆరోపణలు చేసింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో యువతిని ఎలా పెళ్లి విషయమై ప్రశ్నించగా తాను ఎవరిని పెళ్లి చేసుకోలేదని శ్యామ్యూల్ తనను మోసం చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది.

రొమాన్స్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు
తనను ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని పాస్టర్ శ్యామ్యూల్ కు ఫోన్ చేస్తే తనను దుర్భాషలాడాడాడని, గతంలో చాలాసార్లు తాను ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన అసభ్యకరమైన వీడియోలు చూపించి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు చాలాసార్ల పాస్టర్ శ్యామ్యూల్ తన మీదదాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది.

ఆత్మహత్యాయత్నం చేసిన లేడీ
నా దగ్గర రూ.2 లక్షలు తీసుకున్నాడని, తరువాత నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయని, నగదు వాపసు ఇవ్వాలని మనవి చేస్తే శ్యామ్యూల్ ఇవ్వడం లేదని, అతని టార్చర్ తట్టుకోలేక తాను ఇటీవల ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు ఇరుగుపొరుగు నన్ను రక్షించారని, తనలాగా ఆ పాస్టర్ శ్యామ్యూల్ వలన ఎవ్వరూ మోసపోకూడదని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి బాధితురాలు జిల్లాకలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఎంట్రీ
బాధితురాలు ఫిర్యాదు స్వీకరించిన జిల్లా కలెక్టర్ పాస్టర్ శ్యామ్యూల్ గురించి విచారణ చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే పాస్టర్ శ్యామ్యూల్ పాస్టర్ పదవికి రాజీనామా చేశారనే ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. పది సంవత్సరాల నుంచి ఓ మహిళతో కాలం గడుపున్న పాస్టర్ మీద బాధితురాలు కేసు పెట్టడం తిరునల్వేలి జిల్లాలో కలకలం రేపింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications