ఇన్ స్టాగ్రామ్ బాయ్ ఫ్రెండ్, నాలుగు నెలల గర్భిణి ఇలా అవుతుందని ?

కాలేజ్ లో చదువుకుంటున్న యువతి, యువకులు ప్రేమించుకోవడం, హ్యాపీగా తిరగడం మనం చూస్తూనే ఉన్నాము. ఇక మారుతున్న టెక్నాలజీకి అనుగునంగా సోషల్ మీడియాలో యువతి, యువకులకు పరిచయం కావడం, తరువాత ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం ఇటీవల కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము. ముక్కుముఖం తెలీకుండా సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తులను లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్న వారి జీవితాలు చాలా వరకు నాశనం అవుతున్నాయి.

ఇలాగే కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఓ వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బెళగావిలో చోటుచేసుకుంది.మంజుల(22) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చనిపోయిన మంజుల నాలుగు నెలల గర్భిణి. ఏడాదిన్నర క్రితం బెళగావి జిల్లాలోని మచ్చేకు చెందిన బాలేషాకు, మైసూరుకు చెందిన మంజులకు ఇన్‌స్టాగ్రామ్‌ లో అనుకోకుండా పరిచయం అయ్యింది.

The young woman who married her Instagram boyfriend died suspiciously

బెళగావిలోని పారిశ్రామిక ప్రాంతంలో బాలేషా పనిచేస్తున్నాడు. బాలేషా, మంజుల ఇన్ స్టాగ్రామ్ ( Instagram) ద్వారానే కలుసుకున్నారు. రానురాను బాలేషా, మంజుల స్నేహం ప్రేమగా మారింది. సోషల్ మీడియాలో ప్రేమించుకున్న మంజుల, బాలేషా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. కొంతకాలం పాటు మనం పెళ్లి చేసుకుందామని, కలిసి జీవిద్దామని ఇద్దరూ చర్చించుకున్నారు.

వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్న తరువాత ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే మంజుల, బాలేషా కుటుంబ సభ్యులు వీరి పెళ్లిని వ్యతిరేకించారు. కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా మంజుల, బాలేషా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం మంజుల ఆమె భర్త బాలేషాతో కలిసి బెళగావిలో కాపురం పెట్టింది. మంజుల ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. అయితే మంజుల అనుమానాస్పదంగా మృతి చెందింది. రెండు రోజుల క్రితం మంజుల ఇంట్లో ఉరివేసుకుని శవమై కనిపించింది.

The young woman who married her Instagram boyfriend died suspiciously

మంజులను గొంతు నులిమి హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. భర్త బాలేషా వేధింపులతో విసిగివేసారి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఊపిరాడకుండా చేసి ఆమెను ఉరివేసి చంపేశారా ? అని ఆరా తీస్తున్నామని బెళగావి పోలీసులు తెలపారు. బెళగావి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంజుల భర్త బాలేషాను అదుపులోకి తీసుకుని కేసు విచారణ చేస్తున్నామని సోమవారం బెళగావి పోలీసులు మీడియాకు చెప్పారు.

సోషల్ మీడియా ప్రియుడిని పెళ్లి చేసుకుని గర్భవతిగా ఉన్న సమయంలోనే మంజుల శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఒకరిని ఒకరు చూసుకుని కలిసిమెలసి తిరిగిన తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నా అలాంటి కాపురాలు నిలబడటం లేదని, ఇక సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకుంటే మా కూతురి జీవితం లాగా వాళ్ల జీవితాలు నాశనం అవుతాయని మంజుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+